పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 26

మోహి -- రెడ్డీ! వెళుదామురా.

శ్యామ -- మీరునిజముగానే వీళ్ళను పంపించివేస్తారా?

రామా -- నేనుకాదు నీ వేపంపించివేస్తావు. నిజం చెప్పవలసి నట్టయితే వాళ్ళిద్దరూ మొగుడూ పెళ్ళాలుకారు.

శ్యామ -- కారా!

రామా -- కారు.

మోహి -- (మగనితో) మనకువివాహమయిన సంగతియీయనకు తెలియనేలేదా?

కర -- వూరుకో.

శ్యామ -- నాకీమాయ తెలియకుండావున్నది. వాళ్ళిద్దరూ కూడా మహుమంచి వాళ్ళుగా కనపడుతూనే వున్నారే.

రామా -- పయికి మంచివాళ్ళుగానే కనపడుతూ వున్నారు. వాళ్ళునిజంగా భార్యా భర్తలయితే వాళ్ళను వెళ్ళగొట్టడానికి నాకుమాత్రం యిష్టంవుంటుందా?

కర -- మేము పెళ్ళిచేసుకున్న మొగుడూ పెళ్ళాలమయిన మాట నిజమయినట్టయితే మమ్మలిని వెళ్ళగొట్టడం మీకుయిష్టం లేదుగద? అలాగయితే దీనినిజమంతా ఆవచ్చే శాస్తుర్లుగారు చెపుతారు. ఆయనను అడగండి.

[అప్పుడు సోమభట్లు ప్రవేశించుచున్నాఁడు]

రామా -- అయ్యా సోమభట్లుగారూ! నమస్కారము. మీరు యేంపనిమీద వచ్చినారు?

సోమ -- ఈరోజున మీతండ్రిగారి తిధిప్రయోజనము. నిన్నటి రాత్రినుంచీ మీకోసం తిరుగుతూవుంటే మీదర్శన మయిందికాదు. వుదయమయిన తరువాత నాలుగు మాట్లుయిక్కడకు వచ్చినాను. మీరు వంటిఘంటవరకూ యింటికేరాలేదు.