పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 20

కర -- నేను చెప్పేది చివరదాకావినండి. నాకుచెప్పడానికి సిగ్గు వేస్తూవున్నది. మీయిద్దరికీ కోపం తెప్పించడానికి కారణమయిన ఆనిర్దోషురాలు నాపెళ్ళాము.

రామా -- నీభార్యా?

శ్యామ -- నీ పెళ్ళామా?

కర -- అవును నా పెళ్ళామే. పంతులుగారు మీనిమిత్తమయి మంచిదాసీని కుదుర్చుమని నాతోచెపితే నాపెళ్ళాము పెద్దమనిషీ వళ్ళువంచి పనిచేసేదీ అని తీసుకుని వచ్చినాను. అమ్మ గారుకొన్నాళ్లు చూచి తమ మనసువచ్చినట్టు పనిచేసేదనితోస్తే జీతంనిర్ణయించి భార్యాభర్తల నిద్దరినీ పోషించేభారమే మీది.

రామా -- (తనలో) వీడు బహుబాగాబొంకినాడు. ఇందులో వీడుచెప్పినది. వక్కక్షరమయినా నిజంకాదనడానికి లేశమయినా అవకాశములేదు.

శ్యామ -- నాకోసము శ్రమపుచ్చుకొని మీరు దాసీ నిమిత్తమయి యింతప్రయత్నంచేసినందుకు నాకు సంతోషంగావున్నది. కరటకా! యేదీ నీభార్యను నాకు చూపించు.

కర -- రండివెళ్ళిచూతాము. (కరటకరెడ్డియు శ్యామలాంబయు పోవుచున్నారు.)

రామా -- ఔరా! రెడ్డీ! యెంతచక్కగా బొంకినావురా? నాకదివరకు నిజం తెలిసివుండక పోయినట్లయితే చెప్పినదంతా నేనూ నమ్ముదును. వీడు నిముషంలో ఆకొత్తదాన్ని పెళ్ళాముగా మార్చివేసినాడు. యెలాగయినా యీ అపూర్వవివాహంవల్ల మాదంపతులకు కలహం తప్పిపోయింది. నేటికి నేను బ్రతికినాను.

(శ్యామలాంబ ప్రవేశించుచున్నది.)

శ్యామ -- నేను మనరెడ్డిపెళ్ళామును చూచినాను. దానివద్ద వినయమూ తెలివీ కావలసినంత వున్నవి. అది శూద్రదయినా