పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 9

రామా -- అవును యెఱ్ఱనిచిన్నదే. ఇంకాయేదయినా ఆనవాలుచెప్పు.

కర -- అట్టేపొట్టికాకుండా పొడుగుకాకుండా వుంటుంది.

రామా -- అవును అలాగేవుంటుంది. మరివకగురుతు చెప్పు.

కర -- తలవెంట్రుకలు నల్లగావుంటవి కొప్పు పెడుతుంది.

రామా -- అందరూ కొప్పుపెడుతారు. అందరి తలవెంట్రుకలూనల్లగానేవుంటవి. ఇదేంఆనవాలు?

కర -- ఆలాగైతే యెవరికీలేని మంచి ఆనవాలు యింకొకటి చెపుతానువినండి. ఆచిన్నది కుంకుమబొట్టు పెడుతుందికాదూ? కళ్ళకి కాటుక పెడుతుంది.

రామా -- ఈరెండు పనులూ అందరూచేస్తారు.

కర -- అందరూ యెందుకు చేస్తారు? మాఆన్నగారి పెళ్ళాం చెయ్యదు. ఆవిడ యెప్పుడూ బొట్టుపెట్టుకోదు. కాటుక పెట్టుకోదు. కొప్పు పెట్టుకోదు. గాజులుపెట్టుకోదు.

రామా -- మీఅన్నపెళ్ళాం వెధవచిన్నది కాబోలును.

కర -- అవును. వెధవచిన్నదే కాబోలును. మీరన్నది యే అన్నపెళ్ళామూ? ఇప్పుడు మీమేనమామగారియింట్లో పనిలోవున్న అన్నగారిపెళ్ళాముకాదూ? ఆవిడవెధవే. ఆవిడను మొగుడు కోపమువచ్చినప్పుడు యెప్పుడూ వెధవా వెధవా అంటూవుంటాడు. నిరుడుమరిడీజాడ్యాలలో చచ్చిన అన్నగారిపెళ్ళాం వక్కత్తేమాత్రం విధవకాదు.

రామా -- మీఅన్నగారు బ్రతికివుండగా పెళ్ళాం వెధవ యెలాగయిందోయి?

కర -- నన్నువూరికే ప్రశ్నలువేసి భ్రమపెట్టకండి. మీరు యాభయిప్రశ్నలు వేసినా నేను అబద్ధంఆడను. మహా రాజులాగు