“సంస్కృత సాహిత్యగ్రంథాలు పూర్తిచేసుకునేదాకా నువ్వు తెనుగు ప్రబంధాలు ముట్టుకోవద్దు" అని దృఢంగా నిషేధించారు కూడా, వారు.
ఒకమా టింటికి వచ్చినప్పు డీమాట చెప్పగా మా పెద్దన్నగారూ అదే అన్నారు.
సరే, నాకు మేఘసందేశమూ, భారవిలో కొన్ని సర్గలూ పాఠం చెప్పిన దర్భా భైరాగిశాస్త్రిగారు “చచ్చు తెనుగు, ఫోనిస్తూ" అనేవేశారు, నిరసనగా.
"సంస్కృత సాహిత్యం అంటనివాడే తెలుగుల్లో ప్రవేశిస్తాడు, మన కది తగదు” అనిన్నీ మందలించా రాయన.
తరవాత్తరవాత బహుపరిశీలనగా కనిపెడుతూవచ్చాను, సంస్కృత సాహిత్యపరుల దందరిదీ యిదే సిద్ధాంతం.
తెనుగు సాహిత్య పరులందరూ ఆదిలో తప్పనిసరిగా సంస్కృతంలో ప్రవేశించి వుండడమూ, అయితే, వారి సంస్కృత పాండిత్యం సామాన్యం అయిపోయి, తెనుగు ప్రావీణ్యమే అధికం కావడమూ బైరాగిశాస్త్రిగారి సిద్ధాంతానికి మూలమేమో నేను చెప్పలేను; కాని తెనుగులో వొక్క అక్షరమైనా తెలిసివుండకపోయినా, సీతారామశాస్త్రిగారి మాటే నా కప్పు డశనిపాతం లా తోచింది, బైరాగిశాస్త్రిగారి మాటతో నాకు ప్రాణాలే యెగించి పోయాయి.
కానయితే, సంస్కృతంలో నా కప్పటికి మంచి ప్రవేశమే కలుగుతోంది.
రుచిన్నీ బాగా పుట్టివుంది.
అది విడిచిపెట్టాలనీ లేదు.
అయితే మాత్రం తెనుగు చచ్చుదా?
తెనుగుభాష చచ్చుదయితే మరి తెనుగుజాతి?
పైగా తెనుగువాడే యిలా అనడమా?
మహా కసి పుట్టేసింది నా కీమాటమీద.
“తెనుగులో మంచిపాండిత్యం సంపాదించాలనుకున్నాను, వెంటనే నేను.
పాండిత్యం సంపాదించడమే కాదు, గుడిగోపురంమీద యెందు కెందుకో కలలు కనడంలో గ్రంథాలు రచించా లనిన్నీ కలగన్నాను.
22
వల్లూరి ప్రస్తావన విడిచిపెట్టడానికి ముందు, బహూ రసవంతమైన వుదంతం వొకటి చెప్పవలసివుంది, తప్పనిసరిగా.
అప్రయత్నంగా - అనుకోకుండా కూడా శాశ్వతంగా నా జీవితం వొక పూలబాటకి మళ్ళడాని క్కారణమైన ఘటన అది.
ఇప్పటికీ నా కబ్బురపాటు కలిగిస్తూనే వుంటుం దది, జ్ఞాపకం వస్తే.
దాని క్కారణం యేమిటో, అప్పుడు గుర్తించా లేకపోయాను, ఇప్పు డూహించా లేకపోతున్నాను.
జరిగిందేమిటంటే?
ఒకటి రెండు మాసాల్లో నే నిక వల్లూరు విడిచిపెడతా ననగా, వొకనాడు
64
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1