ఇలాగ, మా జట్టుతో కలిసి ఆ రోజుల్లో ఎన్నో పొలాలు తిరిగా న్నేను. ఎన్నో ఆటలాడాను.
అయితే, ఉన్నట్టుండి, మా ఆనందం, పెళ్ళి అయిన యేడాదికి, భార్య రజస్వల అయిన కొద్ది మాసాలకు, ఆకస్మికంగా జ్వరపడి, విషమించగా హఠాత్తుగా చనిపోయాడు.
ఎంతో తెలివయినవాడు మా ఆనందం,
ఎంతో చురుకయినవాడు.
ఏమిటేమిటో ప్లానులు వేసి నిమిషంలో సాధించేవాడు.
నాకు మన సిచ్చేసి నా మనసు పుచ్చుకున్నాడు.
అన్నగారిని కూడా కాదని తా నేది అనుభవిస్తే అది నేను కూడా అనుభవించేదాకా విడిచిపెట్టేవాడు కాడు.
నాకోసం భోజనమున్నూ మానేసేవాడు.
పెళ్ళి అయాక "యింకా యింకా” అంటూ కొసిరి కొసిరి మంచి శ్లోకాలు చదివించుకుని విని ఆనందించేవాడు.
మా ఆనందం అకాలమరణం వాతబడిపోయాడు . నన్ను విడిచి ఆనందధామానికిన్నీ వెళ్ళిపోయాడు.
19
దీపావళి వస్తోందంటే తమ పత్రికలకు దీపావళి సంచికలు ప్రకటించుకోవాలని యిప్పటి పత్రికాసంపాదకుల కెంతెంతో తహతహ.
ఇది చూస్తే రకరకాల బాణసంచా తయారుచేసుకోవాలని నే నప్పుడు పొందుతూ వచ్చిన తహతహ అంతా జ్ఞాపకం వస్తోంది.
మొదటిమాటు, పది సంవత్సరాల వయస్సున నే నీ తహతహలో పడ్డట్టు జ్ఞాపకం.
చదువుకుంటూ మా అన్న లిద్దరూ పొరుగూళ్ళలో వుండేవా రప్పుడు.
మా చిన్నక్కా, నేనూ, మా చెల్లెలూ మాత్రం యింటో వుండేవాళ్ళం.
పెళ్ళయింది గాని మా చిన్నక్క యింకా కాపరానికి వెళ్లలే దప్పటికి.
శరన్నవరాత్రులు వచ్చాయంటే, బండెడు తాటాకుపుస్తకాలూ, రెండు పెట్టెల కాగితం పుస్తకాలూ పూజాపీఠం మీద పేర్చి సరస్వతీపూజ చెయ్యడం తాతముత్తాతల దగ్గిర నుంచీ మా యింటో వున్న ఆచారం.
సంకురాత్రికంటేనూ పెద్దపండుగ మా కది.
మా అన్నలు అందుకోసం తప్పకుండా యింటికి వచ్చేవారు.
ఎవ రెవరి పెరళ్లలోనూ వున్న పువ్వులన్నీ అడిగి కోసుకురావడమూ, ఏమేమి పిండివంటలు తయారవుతున్నాయో, అవి యెంతవరకూ వచ్చాయో మాటిమాటికీ అడుగుతూ మా అమ్మగారిని విసిగిస్తూ వుండడమూ, అందరికంటేనూ ముందుగా స్నానంచేసి, మడిబట్ట కట్టుకుని, పుస్తకాలమీద నిన్న పూజచేసిన పువ్వులన్నీ
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
53