Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక్క క్షత్రియకుటుంబమూ, పది పదిహేను కమ్మకుటుంబాలూకూడా వున్నాయి. గాని, పెత్తనం అంతా ముందు మున్సబు కరణాలదీ, తరవాత రెడ్లదిన్నీ.

ద్వారంపూడి మంగిరెడ్డి అని రెడ్లలో వొక సంపన్నగృహస్థు.

అతని కిద్దరు తమ్ములు, ముగ్గురూ ఆణిముత్యాలు వారు.

వారిలో యెవరు కావలసినా పొలాల్లోనే దొరకడం తరుచు.

పగలంతా పొలాల్లో వ్యవసాయం పనులూ, రాత్రి యింటిలో నిద్రా - ఇంతే వారి దినచర్య.

మేము నలుగురమూ వొకనా డొక గానుగు దగ్గిర చెరుకు పానకం పుచ్చుకున్నాం, తృప్తిగా.

పచ్చిపానకం, చెరుకుగడలు, వేడిబెల్లం - వీటిలో వొకటి పుచ్చుకున్న చోట మరొకటి పుచ్చుకోగూడదని ఆనందం యేర్పాటు.

అదయ్యాక యెవరి గానుగు దగ్గరికి వెళ్ళడమా అంటూ కూడబలుక్కుంటూ కాలవగట్టే వెనక్కి మళ్లాం.

ఊరికి దగ్గిరగా, వనుమలమ్మ గుడికిన్నీ నైఋతిగా, కాలవ దక్షిణాన అరఫర్లాంగులో మంగిరెడ్డి చెరుకుతోటా, తోటమధ్య దిమ్మా, దిమ్మమీద గానుగూను.

"అందరమూ కాలవగట్టున వుండి, నొక్కొక్కళ్ళమే వెళ్ళి చెరుకుగడలు తెచ్చుకుందాం" అన్నా డానందం.

చివర, ఒక్క నిమిషం మేము ఇద్దరమూ "నువ్వు ముందు" అంటే "నువ్వు ముందు" అనుకున్నాక, ముందు ఆనందం వెళ్ళాడు.

ముగ్గురి తరవాతా నేను వెళ్లాను కాని; ఆ ముగ్గురికీ మూడు గడలిచ్చిన మంగిరెడ్డి, ఎప్పుడూ లేంది, నన్ను చూసి విసుక్కున్నా డావేళ, ముందు.

"ఇందాకా వచ్చి పుచ్చుకుని, గడ దాచేసుకుని మళ్ళీ వచ్చారా?? అంటూ నిలవతీశాడు, తరవాత.

దానిమీద “ఇష్టం లేకపోతే నువ్వు నా కివ్వడం మానెయ్యి, అంతేగాని, అబద్ధమాడుతున్నాననీ, మళ్ళీ వచ్చాననీ అనకు, నేనిదే రావడం" అని బదులు చెప్పి, మేము చేసుకున్న వప్పందమున్నూ వివరించి చెప్పా న్నేను.

కాని, అతనది వినిపించుకోలేదు.

అభిమానం ముంచుకువచ్చి, గిరుక్కున తిరిగి వెనక్కి వచ్చేశా న్నేను.

"సిద్ధాంతిగారి అబ్బాయి వచ్చినట్టులే దన్నయ్యా" అని అతని తమ్ముడు సుబ్బారాయ డనడమూ "వచ్చారు, నా చేత్తో నే నిచ్చాను గడ" అని మంగిరెడ్డి అనడమూ నా చెవిలో పడ్డాయి, వెనకనే వచ్చి.

నేను చాలా బాధపడ్డా నందుకు.

వచ్చి, జరిగిందంతా జట్టుతో చెప్పాను.

వారు ముగ్గురూ తమ గడల్లో నాకు వాటా లివ్వబోయారు గాని "మంగిరెడ్డి నే నబద్ధమాడా నన్నాడు. అతని తోటలో చెరుకుగడ నా కక్కరలే”దని నేను వారించాను, వారిని.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

51