"శకునం మాట మరిచిపొండి. చమత్కారాని కన్నానంతే" అన్నారు మళ్ళీ.
"ఇలాంటి కేసులు నెగ్గడం కష్టం. చివరికి వచ్చేదాకా అక్కడివారు చికిత్స చేస్తూనే వుంటారు. అంతా అయింతర్వాత నాకు తంతికొట్టారు. సకాలంలోనే అందింది నాకది; కాని మెయిలు కదలాలి, రాత్రంతా నడవాలి, నేను పిఠాపురంలో దిగాలి, లక్ష్మీనరసాపురం చేరుకోవాలి – ఇంతవరకూ కాలమూ నిలవదు, రోగమూ నిలవదు. ఆ వ్యక్తి బతికేవుంటే, నే నక్కడికి వెళ్ళేటప్పటికే అక్కడివారి చికిత్సవల్ల రోగం మళ్ళవచ్చు. ఇదంతా అవతలివారి అదుర్దామాత్రమే" అన్నారు, తరవాత.
"శకునంమాట మరిచిపొండి" అంటూ మళ్ళీ అందుకుని "కాని, రాత్రి నన్నేడిపించారు మీ" రన్నారు, గంభీరంగా చేస్తూ.
నాకు తెలుసు, హృదయం వున్నచోట అలా జరుగుతుందని. అయినా చేతులు జోడించుకున్నా న్నేను.
"వద్దు వ"ద్దంటూనే నా అంజలిబంధం పట్టుకొని "అలాంటి రాతరాసి యిప్పుడిలా చింతించడం యేమి సొగసూ మీరు" అనడిగారు.
“చమత్కారం జరిగిందన్నారు తరువాత.
"సెల విప్పించం"డన్నా న్నేను.
వారు ప్రారంభించారు.
"కంపార్టుమెంటు కంతకూ ఒక యూరోపియనూ, నేనూ మాత్రమే వున్నాం. బండి బయలు దేరింది. నేను మీ నవల విప్పాను. యురోపియ నొక పుస్తకం విప్పాడు. రెండు పేజీలు చదవడమూ ఆ కాగితం చింపి కింద పారెయ్యడమున్ను అతను. గూడూరు దాటింది మొదలు కళ్ళ నీళ్ళు పెట్టుకోడమూ, తుడుచుకోడమూ, నా పెదవులు వణకడమూ, అయినా నవల చదువుతూనే వుండడమున్ను నేను. 'అదేమి' టనడిగాడతను. 'నువ్వాకాగితాలు చింపెయ్యడం ఏమిట'నడిగాన్నేను.”
ఇలా అని, ఒక క్షణం ఆగి, విన్నారా అన్నట్టు చూసి, మళ్ళీ ప్రారంభించారాచార్యులు గారు.
"రెయిలు ప్రయాణాలవంటి సందర్భాల్లో, కాలక్షేపం కావడానికి ఉద్దిష్టాలీపుస్తకాలు. ఒకమాటు చదివితే చాలివి. అంతే, యిది చదివితే కలిగే ఆనందం మళ్ళీ అనుభవించ నక్కరలేదని కాదు. కొత్తపుస్తకాలు వస్తున్నాయి. ఎందరో యువకులు తమ ప్రతిభ ప్రకాశం కోరుతున్నారు. వారి రచనలు కూడా చదవాలి మనం. వారికిన్నీ ప్రోత్సాహం కలిగించాలి మనం. మన రచన చదువుతోంది లోకం, కనక మనమున్నూ రాద్దాం" అన్న సంకల్పమున్నూ కలిగించాలి, మనం కొత్త యువకులకు.
"అంటే, యీ రచన వుద్దేశం యేమిటో అది నెరవేరి పోయింది. ఈ రచనకీ ఆకృతి ఎందుకోసం పుట్టిందో... అది నెరవేరిపోయింది. ఇక నిలిచివుండవలసింది కాదిది. ఉండ నివ్వ వలసిందీ కాదు. ఉండనివ్వడం వివేకంకాదు. అవివేకం అవుతుంది" అన్నాడు ధృఢంగా అతను.
"ఇది వింతగా వుంటుంది మీకు" అంటూ ప్రారంభించాడతను.
"మీకూ, మాకూ దృక్పథంలో చాలా భేదంవుంది. పరిస్థితులున్నూ మావి వేరు. మీవి వేరున్నూ, అలాగే అచ్చు లేని రోజుల పరిస్థితిన్నీ వేరు. పుస్తకం
562
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.