ప్రవృత్తి మార్గంలో సంఘం కట్టుబాట్లకే ప్రాముఖ్యం.
అది బాగుపడితేనే జాతికి కొత్తశక్తికొత్త దృక్పథమున్నూ యేర్పడ్డం.
సంఘం కట్టుబాట్లుచెడి, సహనమూ ఐకమత్యమూ లేని వారికి రాజకీయాధికారం చేజిక్కితే అది వ్యక్తి వికాసాని కుపయోగపడదు, యెదటి వారి నణచివెయ్యడానికే దారితీస్తుంది.
అది విప్లవానికి మూలం అవుతుంది, చివరికి.
రాజకీయాలకే మొదటిదెబ్బ, దానివల్ల.
రామమోహనరాయివచ్చి, యిదివరకే పెరిగిపోయివున్నవి చాలక, మరో కొత్త మతం కల్పించాడు, పరధర్మం వరవడితో.
దయానంద సరస్వతీ అదే చేశాడు, అంతకంటే బలంగా.
మనమీద విరుచుకుపడుతున్న క్రైస్తవ ముస్లిం ధర్మాల నెదురొడ్డవలసినవవి, కాని మనలో వున్న చీలికలు మరిన్ని చేశాయి.
ఇది తప్పు దారి.
సంఘం బలపడే సమయం యిది.
తద్వారా జాతి దృఢపడవలసిన సందర్భం యిది.
కనక, లౌకికంగా - ప్రవృత్తిపరంగా - జనుల నడవడి సరిదిద్దవలసిన సన్నివేశం యిది.
సంఘసంస్కర్తలేకాదు, వారితోపాటు రాజకీయవాదులున్నూ గాడి తప్పా రిక్కడ.
మనకు స్వపరిపాలనాధికారం వచ్చింది, అయినా, కప్పల తక్కెడగానే వుంది, పరిపాలన నాటి కంటే, యిప్పటికీ.
దానికి జరగవలసిన సంస్కారమూ, దోహదమూ జరగలేదు, మరి.
జాతీయతకు కూకటి వేరే పురుగు పట్టింది కూడా.
ఇది అపాయకరం అని గుర్తించగలిగినవాడు వివేకానంద స్వామి వొక్కడే.
అయితే, గాంధిగారి కాంగ్రెస్సుసాచివ్యం స్థిరపడేనాటి కాయన లేడు.
పోనీ అంటే, సమగ్రవేత్త మరొకడైనా అలాంటివాడు లేక పోయా డప్పుడు.
ఇదే సూచించా న్నేను, తరవాత నేను నడిపిన ప్రబుద్ధాంధ్రలో, వొకచోట.
"ఉద్బోధయత్యుచ్చై శ్శ్రీమాన్ బాలగంగాధర తిలక మహాభాగో" నసంభవతిసౌష్టవం స్వమతసంఘయో, ర్వినా సమగ్రం రాజకీయేష్వధికారం ఇతి. అపదచ్చ వివేకాందస్వామీ " నలభ్యతే అధికారో రాజకీయో, వినాస్వమత సంఘ యోస్సౌష్టవం" ఇతి. ఉభౌ మహాంతా నేవ పండితా, నా ప్యేకీ భవతః ఏతస్మిన్నే కస్మిన్విషయే. కాపున్నర్గతి స్యామానాం" అని.
కనక, సుబ్బారావుగారి నమ్మకమేకాదు, నా నమ్మకమూ కూడా అప్పటికే కా దిప్పటికీ మారలేదు, లేశమున్నూ.
ఇక ముందున్నూ మారవు, అంత ఘనీభవించి పోయాయవి.
522
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.