ప్రథమో చ్ఛ్వాసంలో వుందది.
ఏ విధంగామా చైతన్యం లేని జాతి, మనది.
కొత్త వొక వింత.
కాని, మహామహులెవరూ యేకీభవించలేదు, గాంధీ గారితో.
కొత్తవారు రంగస్థలానికి వచ్చారు.
గాంధీగారి తరవాత అంతటి చలామణీ యేర్పడింది, వారికి.
కద్దరు కట్టడం ప్రారంభించారు కొందరు, దాని ఆంతర్యం తెలిసి మాత్రం కాదు.
సుబ్బారావుగారు తెల్లని ముతక కద్దరు కట్టుకుని వున్నారప్పుడు.
ఇప్పటికీ వారి వస్త్రప్రీతి అదే అనుకుంటాన్నేను.
మొదణ్ణుంచీ కద్దరు నమ్మలేదు, నేను.
స్వపరిపాలనాధికారం సంపాదించే యోగ్యత యేమీ లేదందులో, దేశీయుల్లో, విభేదాలకు రూపకల్పనచేసే శక్తి తప్పించి.
ఏ క్షణానికా క్షణం కొత్త వూపిరి పోస్తేనే మనుగడ దానికిప్పటికీ.
మానసికమైన పరిణామం కలిగించే శక్తి కూడా లేదు, దానికి.
అది కడితేనే కాంగ్రెస్సులో ప్రవేశం యెవరికయినా.
ఇలాగ, వొక రాజకీయ పక్షానికి వొక వలయం అయిపోయింది అది.
ఇతర పక్షాలవారు అదంటే విముఖత చూపడంలో అసంభావ్యత యేమీ లేదు.
ఏ రాజకీయపక్షానికీ కట్టుబడనివారు కూడా దాని యెడల ముగ్ధులు కాకపోడంలో కూడా వింతలేదు.
అప్పటికీ యిప్పటికీ గూడా యిదే నా నమ్మకం.
నాది వైదిక సంస్కారం.
దానిమీదే యెంతో నమ్మకం నాకు.
గాంధీగారిది జైన సంస్కారం.
దానిమీదే తమ నమ్మకం అన్నట్టు మాత్రం కనపడరు, వారు.
కాని, నిశితంగా పరిశీలించగలవారికి, వారి దండయాత్ర, అటు బ్రిటిషువారి మీదకంటే, యిటు వైదిక సంస్కారం మీద చాలా యెక్కువ అన్నట్టు స్పష్టం అవుతుంది.
జైనబౌద్ధ మతాలకూ, వైదికమతానికీ వెనకటి శతాబ్దుల్లో జరిగిన ధారుణ సంఘర్షణ తెలిసివున్నవారికేగాని సమన్వయం కాదిది.
కాక,-
సంఘ సంస్కారం అంటే మత ధర్మాలను తిరస్కరించడమే అని మన సంఘ సంస్కర్తల సిద్ధాంతం యిప్పటికీ.
మొదణ్ణుంచీ వారు చేస్తున్న పెద్ద పొరపాటిది.
సంఘం వేరూ, మతం వేరూను.
మనం మత ధర్మాలకే కాదు, సంఘం కట్టుబాట్లకుమ్నా చాలాదూరం అయిపోయి వున్నాం.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
521