బండి కదిలాక - ప్లాటు ఫారమున్నూ దాటేశాక చూసుకోగా టిక్కట్టుకాక 11-9-0 చేతిలో వుంది.
15-0–0లు ఇచ్చారన్న మాట నరసింహశాస్త్రిగారు.
17
బెజవాడ రెయిల్వేస్టేష నొక రేకుల షెడ్డు ఆ రోజుల్లో.
పైని కప్పేకాదు, కింద, గోడలున్నూ రేకులే.
పల్లెటూరి సంతపాకకంటే నికృష్టంగా వుండేదది.
పాతవూరి పక్క కుండేదది, యిప్పటిలాగ మధ్యగాకాదు.
ప్లాటుఫారం యేర్పాటులేదు, రెండు గజాల యెత్తున యెగబాకి రెయి లెక్కవలసి వచ్చేది ప్రయాణీకులకు.
అక్కణ్ణుంచి, మద్రాసుకి, మూడో తరగతి మెయిలు ఛార్జీ 3-7-0లు ఆ రోజుల్లో.
నా జీవితంలో, నేను చెల్లించిన మొదటి పెద్దరెయిలీ ఛార్జీ అది.
మెయిలెక్కడమున్నూ అదే మొదటి మాటు నాకు.
సకాలంలో వచ్చి సకాలంలోనే బయలు దేరింది మెయిలక్కడ.
నిదానం యెక్కువగా వుండే దప్పుడు జనానికి.
ఇప్పుడు రెయిళ్ళ కెక్కువయిం దది.
పరప్రభుత్వంలో అన్నిటికీ ఆత్రమే, ఇప్పుడూ నా మరి?
చిన్న కంపార్టుమెంటులో కూచోబెట్టారు తీసుకువెళ్ళి నరసింహశాస్త్రిగారు, తెనాలిలో మరో వైశ్యయువకు డెక్కాడు, అంతే.
గూడూరుదాకా మే మిద్దరమే వున్నాం, కంపార్టుమెంటు కంతకీ.
తరవాత కూడా, చాలా రోజులదాకా, అదే స్థితి మెయిల్లో కూడా.
ఒక్క కునుకు కానిచ్చి, మెళుకువరాగా కిటికీలోనుంచి తొంగిచూసి విడిచి పెట్టింది వంగోలు స్టేషనన్నాడు మిత్రుడు, అప్పటిదాకా నిద్రపట్టలేదు నాకు, బల్లకిబల్ల అంతా నా స్వాధీనంలోనే వుండినా.
బెజవాడలో మెయిలు బయలుదేరింది, “మద్రాసులో మన పని యే మవుతుందో” అన్న ఆందోళనా బయలుదేరింది నాకు.
అక్కడ నిశ్చింతగా రెండు మాసాలుండడానికీ, రానూ పోనూ రెయిలు ఖర్చులకూ లోటులేదు, మరి, వెళ్ళినపని కాక పోతే?
స్వస్థానంలో వుండగానే యిలాంటి విరాళా లంది వుండ గూడదూ, మరో యే డెనిమిది?
పొట్టకోసం మద్రాసు వెళ్ళనక్కరలేదు.
మద్రాసు వెళ్ళినా వీరపూజ అచ్చు కాకపోతే మరెక్కడికి వెళ్ళడం?
దీపాల వెలుగులో రెయిలు పెట్టెలో కూచున్నవాడికి బయటి అంధకారం యెంత ఘనీభవించి వుంటుందో అంతకంటే ఘనీభవించింది నాకీ ఆందోళన.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
499