Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానవత్వమున్నూ వుంది.

కాని తామస ప్రవృత్తులది మాత్రం ముడిసరుకది.

ఇక లోభులున్నారు.

వారి విషయం చెప్పాలంటే అందరికీ సాధ్యం కాదు.

చెప్పకపోడమే మంచి దసలు.

వారి హక్కు భుక్తా లాక్షేపించడాని కెవరికీ అధికారం లేదు.

కలం పట్టుక్కూచున్నాను కనక, నేనుమాత్రం చెప్పకుండా వుండలేను కొంచెమయినా, ఎవరికీ నిర్దేశం లేకుండా.

లోభమూ ఔదార్యమూ కూడా బహు ముఖాలు.

సిగ్గు బిడియాలు విడిచి, తానున్నూ తినడం మానుకుని వొక్కొక్క చిల్లిడబ్బే మూటలో వేస్తాడు లోభి.

సిగ్గుపడుతూ – ముడుచుకుపోతూ - చేతిలో యేమివుంటే అదే యిచ్చేస్తాడుదారుడు.

ఇద్దరికీ మాత్రం డబ్బుతోనే పరిగణన.

అయితే, లోభి బతుక్కి, గడ్డిపరకకూడా అక్కర్లేదు తూచడానికి.

ఉదారుడి బతుక్కి బంగారుకొండ అయినా చాలదు.

10

తింటూనూ వున్నాను తిరుగుతూనూ వున్నాను:, గాని రెండుమాసాలు పట్టింది నా ఆరోగ్యం వసిపడ్డానికి.

రాజమహేంద్రవరంలో వుండినప్పుడు అజీర్తి బాధ పట్టుకుంది నాకు.

వేంకట రామయ్యరు హోటల్లో వుప్మా కాఫీలూ, కుప్పుస్వామయ్య హొటల్లో మూడు పూట్లా భోజనమూ - ఇవీ ఇవీ అందుక్కారణాలు.

జిహ్వచాపలం ముఖ్య కారణం.

చాలా మాట్లను కున్నాను; కాని జయించుకో లేకపోయానది.

తెల్లవారాటప్పటికి వచ్చేసేవారు చిలుకూరి వీరభద్రరావుగారు “మరి బయలుదేరండి" అంటూ రోడ్డుమీద నుంచునే నన్ను తొందర పెడుతూ.

అప్పటికీ, గోదావరిలో యీతకొట్టి, స్నానంకూడా చేసుకుని, కనిపెట్టుకు నుంచునేవాణ్ణి గదికి తాళం వేసి, వీధి అరుగుమీద నేను.

తామున్నూ స్నానం పూర్తిచేసుకునే వచ్చేవారు, వీరభద్రరావుగారు.

హాల్లో బల్లలుండేవి, కాని, తిన్నగా గాడిపొయ్యి దగ్గరికి వెళ్ళి పీటలు పరిపించుకుని కూచునేవాళ్ళం మే మిద్దరమూ.

అంటే, ఉప్మా మొదటివాయిలో మొదటిభాగం మాకు భుక్తపడేది.

నలభైనాలుగేళ్ళ కిందటి మాటయిది, అలాంటి వుపమా దొరకలేదు, మళ్ళీ నాకు.

ఉపమా అంటే అదేవుపమా - ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో - పెద్దపెద్ద హొటళ్ళలో కూడా దొరికేది ఉప్పుపిండి, అంతే.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

477