Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ ప్రాంతం నా తెనుగు దేశపు జీవగడ్డల్లో వొకటి.

అక్కడ, నేను, నా ఆంధ్రసోదరులతో సంబంధం పెట్టుకోవాలి.

ఈ ఆకాంక్ష - ఈ ఆత్రం - యీ పూనిక - వీటితో కమ్మంమెట్టు స్టేషనులో దిగాన్నేను.

8

"ఇలాంటి వాటికి, యిక్కడి తహస్సీలుదారుని చూడ్డం మంచిది ముందు" అన్నాడు, మాతో పాటు అక్కడే దిగిన ఆ వూరి పెద్దమనిషి వొకాయన.

“సాధారణంగా, పండితులెవరు వచ్చినా ఆయన్ని తప్పుకుండా చూస్తారీవూళ్ళో" అనిన్నీ చెప్పాడాయన.

అప్రయత్నంగానో సప్రయత్నంగానో యిలా వాకబుచేసుకుంటూనే పండితులెక్కడికి వెళ్ళినా.

వారు సంపాదించుకున్న జాపితా సమగ్రమూ కావచ్చు, అసమగ్రమూ కావచ్చు కాని యీ వూళ్ళో వుండగానే ముందు వూరి రసికతా ఔదార్యమూ పరిమితి కట్టుకోడం - ఇదొక మంచి సంప్రదాయం, జాతీయ విద్యలు నేర్చుకున్నవారికి.

తీరా వెళ్ళాక, అజాపితా కెక్కిన పెద్దమనుష్యులు కొందరు కనపడావచ్చు, కొందరుకనపడక పోవచ్చు.

కనపడ్డ వారయినా సత్కరించావచ్చు, తిరస్కరించావచ్చు.

"భాషామంజరి సమాప్తః"

ఇక మాట్టాడవలసింది లేదు.

ఆ వూళ్ళో మరి క్షణమైనా వుండనక్కరలేదు.

వార్షికాలు సంపాదించుకునే నలుగు రైదుగురు గురువుల దగ్గర చదువుకుని వుండడం వల్లా, ఎందరో పండితుల ప్రవృత్తి చూసి వుండడం వల్లా యిప్పుడే కాదప్పుడే తెలిసివుండిన సంగతినాకిది.

ఈ యెరుకతో భవిష్యత్తూహించుకుంటూ జట్కా యెక్కాం మేము.

వెతుక్కుంటూ తహసీలుదారు బసకీ, అక్కణ్ణుంచీ కచేరీకీ వెళ్ళాం.

రెయిలు సహచరుడు డాయన బ్రాహ్మడని చెప్పాడు.

ఇంటికి వెళ్ళగా కచేరీకి వెళ్ళమన్నవారు, కొంచెమో గొప్పో సంస్కృతమున్నూ తెలిసినవాడని చెప్పారాయన.

కాని ముస్లిము అన్నట్టున్నా డాయన వేషభాషల్లో.

మామాటే సరిగా వినిపించుకోలేదా "అధికారి”

ప్రారంభంలో నేనే మాట్టాడాను; గాని ఆ ధోరణి చూసి మొగం తిరిగి, యిటు తిరిగేశాన్నేను.

సత్యనారాయణశాస్త్రి, అందుకున్నాడు, అవ్యవధిగా.

కాని, చెవిటివాడిముందు శంఖం వూదడం అయిపోయిం దతనికి ప్రయత్నం కూడా.

468

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.