పోనీ అంటే, మొదణ్ణుంచీ నూటికి యాభై చొప్పున కమిషనిస్తేగాని నావల్ల కాదంటున్నారు, ఇన్ స్పెక్టరు దొరవారు" అని వివరాలున్నూ చెప్పారు వారు.
ఎందుకూ ఏమి చెయ్యలేని స్థితి అయిపోయింది రెడ్డిగారిది.
వారి బెల్లంవ్యాపారం భాగస్వామి వొకాయన అక్కడే వున్నా రాసమయాన, “బాబూ” అని సంబోధించారు నన్ను.
“రాత్రి పదయాకా, ఉదయం ఏడున్నర అయాక వీధి గుమ్మాన నుంచుని రివాల్వరు పేలుస్తాడు చెన్నుబొట్ల ఆయన. 'అదేమిటయ్యా?' అనడిగా న్నేను. 'రాత్రి రివాల్వరు పేలిందంటే యినస్పెక్టరుగారు పడుకున్నా రన్నమాట. దేవుడు వచ్చినా దర్శనం యివ్వరు. ప్రొద్దున్న రివాల్వరు పేలిందంటే, పని వున్నవారు దర్శనం చేసుకోవచ్చు నన్నమాట' అని బదులు చెప్పాడు నాకు. ఇనస్పెక్టర్లందరూ యింతేనా బాబూ?" అనిన్నీ అడిగారాయన నన్ను.
నాకు నవ్వు వచ్చింది.
ఉరిమినట్టు నవ్వారు రెడ్డిగా రొక్కక్షణం గతం మరిచి.
"ఇకనైనా మేలుకో” అన్నారు రెడ్డిగారి తండ్రి.
“తొందరపడకం"డంటూనే వున్నా న్నేను; కాని లెక్కలు తేల్చి, ఇచ్చి పుచ్చుకోడాలు వివరించి, చెన్నుభొట్ల వారిని నమ్మి నన్నీ వ్యవహారంలోకి యిరికించినందుకు విచారించి, కొద్దిపాటి నష్టం తాము భరించి, మిథునానురాగం ఆరువందల ప్రతులే తాము పుచ్చుకుని యెనిమిదివందలు నాకిచ్చి “ఇవాళతో ఎస్.పి.ఏ.ఎల్. ఆఖరు " అనేశారు రెడ్డిగారు, చేతులు దులుపుకుంటూ.
80
అనుకున్నదే నే నిది.
అయనాల్లో కావలసింది, రుతువుల్లో అయింది, అంతే.
అయినా యెప్పుడూ అనుకోనిది రెండు నవలలు రాయించింది ఎస్.పి.ఏ.ఎల్. నాచేత.
నా జీవితాని కిది మంచి ముందడుగు.
కాని, మరి, ముందుమాట?
ఇక రాజమహేంద్రవరంలో వుండి చెయ్యగలిగిందేమీ లేదు నాకు.
కాని, బాగా అలవాటు పడ్డా, నెలాగా పట్నం విడిచిపెట్టడం.
పొద్దుటిపూట అంతా, సాధారణంగా, మా ఆఫీసులో గడిపేవారు చిలుకూరి వీరభద్రరావుపంతులుగారు, వేంకటరామయ్యరు హోటల్లో ఉప్మాకాఫీలు పుచ్చుకు వచ్చి,
అప్పుడప్పుడు వడ్డాది సుబ్బారాయడుగారి దగ్గిర కూచుంటూ వుండేవాణ్ణి నేను, దూరం పదిబారలే కావడంవల్ల.
శ్రీపాద కామేశ్వరరావుగారితో గూడా నాకు బాగా కాలక్షేపం అయేది వారు, ట్రెయినింగు కాలేజీ పని ముగించుకుని వెళ్ళేటప్పుడు మా ఆఫీసులోనూ, రాత్రి భోజనానంతరం వారి యింటోనూ.
తమ అల్లుడు (రామకృష్ణకవుల్లో రామకృష్ణశాస్త్రి) గారి శిష్యుణ్ణి కావడంవల్ల ఏర్పడ్డ వాత్సల్యంతో, ఆర్టు కాలేజీ పని ముగించుకుని యింటికి వెడుతూ,
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
430