ప్రత్యేక ప్రాప్యా లున్నాయి.
సాధనాలున్నూ ప్రత్యేకప్రత్యేకాలున్నూ యెన్నెన్నో.
ఆ ప్రత్యేకతలు పోషించుకోవలసిన విధి వుంది, మిక్కిలీ బలీయం.
ఈ విధికి తప్పితే ఘోర మైన ప్రత్యవాయమూ చుట్టబెట్టుకుంటుంది, అంతకంటే గాఢమైనది.
71
"అయితే, మరి, భారతీయత మాట?"
ఈ ప్రశ్న వస్తుంది.
వెంటనే వస్తుంది, సందేహం లేదు.
ఈ భరతఖండంలో వొక తప్పుడు సిద్ధాంతం ప్రచలితం అవుతోంది మరి, యిప్పుడు.
కనక, ఈ ప్రశ్న వస్తుందనీ తెలుసు, రావడం అనివార్యం అనీ తెలుసు.
కనక, వెంటనే రావడంలోనే సొగసుంది.
ఏమంటే?
ఆంధ్రజాతీయత యెలాంటిదో మనకు, భారతజాతీయతా అలాంటిదే, మరి.
అయితే, వీటి ప్రసక్తికి భిన్నభిన్న సందర్భాలున్నాయి.
అంటే, -
ఆంధ్రజాతీయత ప్రసక్తి వచ్చినప్పుడు భారతజాతీయత స్మరణకు రాదు.
అలాగే, భారతజాతీయత ప్రసక్తి వచ్చినప్పుడు ఆంధ్ర జాతీయతా స్మరణకు రాదు.
తేజస్తిమిరాలవంటి వివి.
తేజస్సుంటే తిమిరం లేదు.
తిమిరం వుంటే తేజస్సున్నూ లేదు.
దేనికదే ప్రత్యేకాలివి.
కలపరానివీ విడతియ్యరానివీ కూడానూ యివి.
కానీ, అన్యోన్యాలు.
ఇదొక విచిత్ర సన్నివేశం.
మిక్కిలీ గాహనమున్నూ.
కనక, సూక్ష్మవిచారణక్కాని అందిది.
ఓఢ్రదేశం, దక్షిణ మహాసముద్రం, తమిళదేశం, కన్నడదేశం, మహారాష్ట్ర, దేశం, మధ్యమాగాణాలు - ఈ హద్దుల మధ్యస్థమైన విశాల భూభాగం రత్నగర్భ.
దేవతలకున్నూ ప్రలోభజనకం యిది.
యుగయుగాలనుంచీ వుంది; కాని, సముద్రంలో నుంచి హఠాత్తుగా పొటమరించుకు వచ్చింది కాదివాళ.
మరి, దీన్నేమనీ పిలవడం.
దిజ్నీర్ణయం చేసి వ్యవహరించడాని కనువుకాని దిది.
407
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి