మైనారిటీ తీరేటప్పటికీ పురుషుడేదో వొక విద్యలో వుత్తీర్ణుడయి వుండడం సాధారణం, అప్పుడు.
పైగా వుపనయనం గొప్ప సంస్కారం, వొట్టి శుభకార్యం మాత్రమే కాదు.
వేదమంత్రా లుచ్చరించడానికిన్నీ అధికారం పుట్టడానికి మాత్రమే కాదు, నియమపూర్వక మైన నడవడి అలవడ్డానికిన్నీ విధాయకం అది.
ఏమంటే?
ఉపనయనంతోనే బ్రహ్మ క్షత్రియ వైశ్య బాలకులకు ద్విజత్వ సిద్ధి.
రెండో జన్మ అనే దదే.
ఉపనయనం అయితేగాని బ్రహ్మా చర్యమున్నూ ప్రారంభం కాదు మరి.
అంటే ఉపనయనం ధార్మిక జీవనానికి నాంది.
ఉపనయనంతోనే విధినిషేధాలు ప్రారంభం అవుతాయి.
ఉపనీతునకు చెయ్యరాని పను లున్నాయి, పోరాని స్థలా లున్నాయి, తినరానివిన్నీ వున్నా యెన్నో పదార్థాలు.
మనిషికి సంస్కారం (కల్చర్) అబ్బాలంటే యీ విధి నిషేధాలు సాధనాలు.
ద్విజుడంటే పూర్ణపురుషుడన్నమాట, మరేమీ కాదు.
సంస్కారం బుద్ధికి మాత్రమే కాదు, నడవడికిన్నీ మూలమే.
ఉపనయనం ముఖ్యోద్దేశమే యిది.
కనక, ఉపనయనం కానివాడు వ్రాత్యుడు.
వ్రాత్యుడు పంక్తిబాహ్యుడు.
కులభ్రష్టుడే కాదు, అస్పృశ్యుడున్నూ.
విషయవాంఛ లంకురించాయా, ఆమనిషి కుపనయనం చేసి యిక లాభం లేదు.
అవి అంకురించకపూర్వమే జీవితంలో విధినిషేధ పరిజ్ఞానం ప్రారంభం కావాలి.
స్వధర్మనిష్టా యేర్పడాలి.
ఇది గుర్తించగలిగితే గాని బ్రాహ్మణబాలునకు గర్భాష్టమంలోనూ, క్షత్రియబాలునకు గర్భకాదశంలోనూ, వైశ్యబాలునకు గర్భద్వాదశంలోనూ ఉపనయనం చెయ్యాలన్న విధి సూత్రం అవగాహన కాదు.
సభ్యత అలవరిచే సంస్కారం అన్న జ్ఞానం లేకపోడమే ఉపనయనం విలవ మనవాళ్ళకి తెలియకపోవడానికి ముఖ్య కారణం, ఇప్పుడు.
మనవాళ్ళ నమ్మకం, చదువు సంస్కారంకోసం అని కాదు, పొట్టకూటికోసమని యిప్పుడు.
మన దౌర్భాగ్యానికీ పతనానికీ ఇదే బీజం.
చదువే పొట్టకూటికోసం అయితే, జీవితం విశృంఖలం కావడానికే అయిపోతుంది, వింత యేమిటీ?
ఈజ్ఞానం నా చిన్నతనంలో వున్నంతలే దిప్పుడు మనలో.
అప్పుడు పదేళ్లు నిండిన బ్రాహ్మణబాలకుల్లో ఉపనయనం కానివా రరుదుగా వుండేవారు.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
17