భీమరాజుగారి కేడుగురు కుమాళ్ళు.
వారిలో చిన్నవా రిద్దరూ నాకు సహచరులు.
నే నింటవుండి వైదికవిద్యలు నేర్చుకుంటూ వుండగా దొడ్డంపేట (వేగాయమ్మ పేట) వెళ్లి వారి ద్దరూ ఇంగ్లీషు చదువులు ప్రారంభించారు.
చదువులు మాత్రం సెకండుఫారం అయినా కాలేదు గాని నాలుగైదు మాసాలు గడిచింది మొదలు, ఇంటికి వచ్చినప్పుడల్లా "పౌస్‌పీస్" అంటూ తమలో తాము స్వదేశీ యింగ్లీషు మాట్లాడుతూ వూళ్ళోనే వుండిపోయిన మా స్నేహితులనందర్నీ డెకారించేవారు వారు.
అది చూసి, ఇంగ్లీషు చదుకోవాలనీ వారికంటే యెక్కువగా "పాస్‌పీస్"మనాలనీ నే నెంతో వూగీసలాడిపోయేవాణ్ణి.
ఇంగ్లీషు చదవనందు కప్పుడే కా దిప్పుడూ చాలా కించగానే వుంది నాకు.
ఎంతో లోటుగానూ వుంది.
నా కింగ్లీషు రాకపోడమే మంచిదయిందనే స్నేహితులున్నా రెందరో, నేనూ అలాగే అనుకుంటూ వుంటాను తరుచు; కాని "అయ్యో" అనిపిస్తూ వుంటుం దెప్పుడయినా నాకు.
నిజానికి, ప్రపంచం అంతటా బహుళప్రచారంగల యింగ్లీషు రాకపోవడం నాకే కా దెవరికయినా దౌర్భాగ్యమే.
కాని “బి.ఏ.లూ, ఎమ్.ఏ. లూ అయిన్నీ యేవిధంగానూ ఇంగ్లీషు నుపయోగించుకోని వాళ్ళకంటే నేనే నయం" అనిపిస్తూనూ వుంటుం దప్పుడప్పుడు.
ఈ లాభనష్టాలేమీ బేరీజు వేసుకోకుండానే నాకూ మా అన్నలకూ కూడా యింగ్లీషు చెప్పించకూడ దనుకున్నారు, మా నాయనగారు.
నా విషయమై మా అమ్మగారు కొంచెం ప్రయత్నించారుగాని ప్రయోజనం లేకపోయింది.
స్వధర్మభ్రంశం తటస్థిస్తుందన్న భయమూ, తూగలేకపోవడమూ యిందుక్కారణాలు.
అయితే, కాలం మార్పు గుర్తించి, వారు, మాకు సాహిత్యమూ, జ్యోతిషమూ, శ్రౌతంలో కొంతా చెప్పారు.
స్మార్తం నాకు పెళ్ళినాటికే - పన్నెండేళ్ళు నిండెటప్పటికే అయిపోయింది.
పెళ్ళినాటికి బడిచదువు నేను మూడో తరగతిలో పద్దెనిమిదో పాఠం చదువుతున్నాను.
అంతే, మరి నేను బడికి వెళ్ళలేదు.
మా కులవిద్యలు నిరాఘాటంగా అబ్బాలనే మా నాయనగారు నన్ను బడి మాన్పించారు.
6
పెళ్ళినాటి క్కావ్యపాఠం రఘువంశం మాత్రమే పూర్తయింది నాకు.
మా నాయనగా రింటోవుండినంతసేపూ కదలకుండా కూచోడమూ, వారిదగ్గిర జ్యోతిషమూ, శ్రౌతమూ, స్మార్తమూ నేర్చుకుంటూ వుండడమూ - వారిల్లు
14
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1