ఫలితం సరిగా చెప్పగలవాడికి విషయం తెలుసుకోవడం యేమంత కష్టంకాదు; గాని, విషయం ముందు చెప్పే ఫలితం చెప్పమనేవా డతను.
"నా భార్య ప్రసవించుబోతోంది. మొగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల కలుగుతుందా?" ఇదీ అప్పుడతని ప్రశ్న.
కొందరడిగి తెలుసుకుంటారు, అంతే, అతను మాత్రం యే సంతానం కలిగినా వెంటనే పుత్రోత్సవం చేసేవాడు, వూళ్లో వున్న బ్రాహ్మల నందరినీ పిలిచి గుమ్మడిపళ్లో కొబ్బరి బోండాలో సదక్షిణాకంగా యిచ్చి.
లగ్నం కట్టుకుని మేము నలుగురమూ బదులు చెప్పాం, ఎవరికీ వారే ఆలోచించుకుని.
మా నాయనగారూ మా అన్నలూ కూతురు పుడుతుందన్నారు, అందుకు భిన్నంగా “కొడుకు పుడతా" డన్నా న్నేను.
పరుగు పరుగున వెళ్ళి యెగిరివచ్చా డతను "మీ చిన్నబ్బాయిగారి మాటే నెగ్గిందంటూ.
తరవాత, అతని దౌహిత్రుని జాతకం నేను రాయడాని కిదీ కారణం.
53
తక్కిన మన విద్యల్లో దేనిమీదా కూడా లేశమూ లేదు; గాని మనవారిలో కొందరికి, జ్యోతిశ్శాస్త్రంమీద - ముఖ్యంగా జాతకప్రశ్నల భాగలమీద గట్టి నమ్మకమే వుందిప్పుడు.
వారిలో కొందరు, ఒక్క వారఫలాలకోసమే పత్రికలు కొంటారు, అవి తప్పించి వొక్క అక్షరమైనా చదవకపోయినా.
సిద్ధాంతులకున్నూ యిప్పుడీ రెండు భాగలవల్లనే మంచి రాబడి, బాగా ఆలోచించగలవా రయితే.
మా నాయనగారికిన్నీ జీవితయాత్ర సుకరం కావడానికీ విద్యలు చాలా వుపకరించాయి.
ఒక నిదర్శనం చెబుతాను.
మునికొడవలి విడిచి మా నాయనగారు పొలమూరు ప్రవేశించిన కొత్తరికం అది.
పక్కవూళ్ళో వొక డీ-పీ-డబ్ల్యూ కంట్రాక్టరు.
ఒక్కక్షరమైనా చదువురాదు; కాని పక్కా ముస్సద్దీ.
పిట్టంత మనిషి; కాని ప్రభుదర్పం పొంగిపోయేది, మొగాన.
ఎక్కడికి వెళ్లినా గుర్రంమీద వెళ్లేవాడు.
తలుచుకున్నాడా, ఏమయినా చెయ్యగల నిగ్రహానుగ్రహసమర్థుడు.
నమ్మినచోట ప్రాణం అయినా ధారపోసే ప్రకృతి అతనిది.
మా నాయనగారు తరుచు చూస్తూవుండేవా రతణ్ణి, మరికొందరు సంపన్నుల తోపాటు.
ఒకనాడు వెళ్లేటప్పటికి దిగాలుపడిపోయి వున్నా డతను.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
354