ఎదురువాదం చేశారు మొదట; కాని వారు గుర్తించని క్రూరగ్రహవిశేషదృష్టి నేను సూచించగా, నా విశ్చయం అంగీకరించా రిష్టపూర్తిగా.
అతిథి అన్నది మాత్రమే కాక, పండితు డన్నదిన్నీ ఆదరభావం కలిగించింది నా యెడల వారికి, దాంతో.
ప్రశ్న చెప్పినందుకు నాలుగు రూపాయలు సత్కారమున్నూ చేశారు వారు.
మృష్ణాన్నభోజనం చేసి, విశ్రమించి, బయలుదేరి వెళ్ళిపోయా నక్కణ్ణుంచి రెండయాక.
39
ఇలాగ చాలా విశేషం వుంది వేషంలో.
మనకంటే యెక్కువ శ్రద్ధగా వుంటారీ వేషం విషయమై యితర మతాలవారూ యితర ఖండాలవారున్నూ, స్త్రీలూ పురుషులూ కూడా.
మనలోనయినా వేషభాషలనే నానుడి.
వీధిలోకి వెళ్ళేవారి కవి రెండూ యెంత బాగా వుంటే అంత మన్నన.
"బాగా వుండడం" అంటే, డాబుగా వుండడం అని కాదు, నీటుగా వుండడం.
అయితే, వేషం విలవా తెస్తుంది, విలవా చెరుపుతుంది, మనిషికి.
జనసామాన్యం భాషదాకా వెళ్ళలేదు, వేషం చూసే ప్రవృత్తి నిర్ణయించేస్తుంది, తరవాత మార్చుకోవలసివచ్చినా.
డబ్బు కాదు, చదువూ కాదు, సామాజిక ధర్మానికి లోబడ్డ చిత్తవృత్తి కారణం వేషానికి.
సామాజికధర్మం అనెందు కన్నానంటే, వొక్కాక్క దేశం - వొక్కొక్క మతం - వొక్కొక్క ప్రాంతంవారి వేషం వొక్కొక్క విధంగా వుంటోంది లోకంలో.
వేషం చూసి మనిషిని అర్థం చేసుకోవచ్చు, చాలామట్టుకి.
వేషమూ భాషా - అంటే మాటతీరూ వీటివల్ల తమ అంతరప్రవృత్తి పైకి పొక్కకుండా గుప్తపరుచుకోగలవారి సంఖ్య బహూ తక్కువ, లోకంలో.
అయితే, వారు పక్కావ్యవహర్తలో, శుద్ధవంచకులో అయివుంటారు.
కాని జీవితానికింత ప్రాధాన్యం వహించే వేషం విషయమై మన తెనుగువారి కిప్పుడు శ్రద్ధా లేదు, సంప్రదాయ గౌరవమూ లేదు, అనుకరణ పరాయణత్వం తప్పించి.
ఇక తెనుగుతనం యెలా నిలుస్తుందీ వారికి ?
మంచి యెక్కడ వుంటే అక్కణ్ణుంచి అది గ్రహిస్తా మంటారు మనలో కొందరు, మన సంప్రదాయం మంచిచెడ్డలు మాత్రం లేశమూ యెరగరు.
ఇదిగాక, - "భారత జాతీయత" అంటూ పెద్దపెద్ద మాటలు వాడేస్తారు కొందరు, అదెక్కడుందో మరి.
భారతదేశానికి ప్రత్యేకభాష యేదీ, ప్రత్యేకవేషం యేదీ, ప్రత్యేక సంప్రదాయమున్నూ యేదీ భారతజాతీయత రూపొందడానికీ?
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
314