పంతులుగా రది సూటిగా వినలేదు.
ఉండనూ లేదు, చివరికి.
సుబ్బారాయడుగారికీ పంతులుగారికీ వుండిన పరిచయం సంగతి నాకు తెలుసు.
మహారాజులుంగారికీ పంతులుగారికీ వుండిన దోస్తీ సంగతి కూడా వినేవున్నా న్నేను.
కనక, నా ప్రయత్నం విఫలం అయితే కావచ్చు.
ఇది నిశ్చయమున్నూ చేసుకున్నాను.
ఏమయినా, భిన్నాభిప్రాయం కనబరిచినవారిని గౌరవించగలనుగాని - విమర్శలు వచ్చినా సావధానత కనబరచగలను గాని - వెక్కిరింతలు సహించలే న్నేను.
ఇదంతా విని గురువు లిద్దరూ చకితులయినారు.
ఇలాంటి సందర్భాలు చాలా చూసీ, వినీ వున్నారు వారు.
“ఇది అపశకున” మన్నారు వేంకటరామశాస్త్రిగారు.
“కావచ్చు” నన్నారు రామకృష్ణశాస్త్రిగారు.
ఇందు కనుగుణంగా, మర్నాడు నేను వెళ్ళీ వెళ్ళడంతోనే "మీ గ్రంథం విషయం ప్రభువే ముందు ప్రస్తావించా” రన్నారు సుబ్బారాయడుగారు.
"రాకపోకల ఖర్చుల నిమిత్తం మీకందచెయ్యమని గురువుల దగ్గిరికి యాభైరూపాయలు పంపించారుకూడా" అనిన్నీ చెప్పారు వారు.
ప్రభువే ముందు ప్రస్తావించడంలో అర్థం వుంది.
“కారణం స్పష్టమే” అంటూ గురువులూ వొప్పుకున్నా రది.
యాభైరూపాయలు పంపడంలో మాత్రం సమన్వయం కుదరలేదు నాకు.
“మరి ఆ ద్రవ్యం పుచ్చుకోడమూ మానడమా?”
"నా ధోరణి గుర్తించి యిప్పటికి పుచ్చుకోండి" అన్నారు సుబ్బారాయడుగారు.
బసకి వచ్చాక గురువులూ ఆ మాటే అన్నారు.
ప్రయత్నం వొకటీ పర్యవసానం వొకటీనీ.
ఎక్కడా కూడా సన్నిధానవర్తుల ధోరణి వొక్కలాగే వుంటుంది.
నా సిద్ధాంతాలు నచ్చకపోతే కోరిక తిరస్కరించాలి, లేకపోతే కారణాంతరా లేమిటో చెప్పి వీలులేదనాలి, చివరికి దర్శనమే యివ్వకపోవాలి; గాని యిదేమిటీ యాభైరూపాయ లివ్వడం?
రాకపోకల ఖర్చు లివ్వడమే అయితే అయిదు చాలు, యాభై యెందుకూ?
ప్రభువులైన వారంత తక్కువ యివ్వ రంటే యెటూ కాకుండా యివ్వడం యేమనాలి?
ఇప్పించేవా రొకరు - ఇచ్చేవా రొకరు - ఇవ్వకుండా చేసేవా రొకరు - స్పష్టంగా ముగ్గురు కనపడుతున్నా రిక్కడ.
దర్శనం చేసి నేను వాచా కోరకుండా - నేను కాగితం రాసి పంపుకోకుండా - సుబ్బారాయడుగారున్నూ యేమీ చెప్పకుండా నా గ్రంథం విషయమూ, నా ఆక్షేపణల సంగతీ ప్రభువు కెలా తెలిసిందీ లేకపోతే?
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
310