Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొత్తపల్లి సూర్యనారాయణగారు చేసిందీ, వారణాసి సర్వదేవుడుగారు చేసిందీ రాశిలో వొకటే, రకంలోనే భిన్నం.

అయితే, ఛందస్సు విషయమై నాకడ్డలేదు, మరి సంగీతం విషయమై?

"దేశో విశాలః ప్రభవో హ్యనంతాః."

ఒక్క సర్వదేవుడుగారి నొసటనే పొద్దుపొడవలేదు.

"మీ లెక్కేమిటి?" అనగలన్నేను.

అని దీక్షా పట్టగలను.

పడితే వూరువిడిచిపెట్టాలి.

దానివల్ల కొన్ని చిక్కులు కలుగుతాయి.

అయినా వెళ్ళాగలను.

వెడితే అందులో మునిగిపోవాలి.

అంతవరకూ వచ్చాక మునిగిపోగలను.

పోతే కవిత్వం చెడుతుంది.

"ఏం, చెడితే?” అనిమాత్రం అనుకోలేకపోయాను.

భావం అంటూ వొకటి తోస్తే తోచినంతా ఛందోబద్ధం చెయ్యగలుగుతున్నా నప్పటికీ ధారాళంగా.

పద్యాల వడకా బాగుంటోంది.

వచనరచన కూడా వొక దారిలో పడివుంది.

మరి, సంగీతం అంటే మిక్కిలీ రుచీ వల్లమాలిన అభిమానమున్నే గాని వోనమాల స్థితిలోనే వుంటినాయె.

ఆలోచించవలసివచ్చింది.

కొన్ని మాసాలు కష్టపడితే కొన్నిలోట్లు తీరి, యేదో వొక యెత్తున జీవితపరమావధి కాగల కళ విడిచిపెట్టి, సంవత్సరాలు కష్టపడినా స్వాధీనం అవుతుందో కాదో అనుమానాస్పదంగా వున్న మరో కళ సాధించాలని దీక్షపట్టడం తప్పనిపించింది.

పోతే "సంగీతం నేర్చుకోడం రసాభా సయిపోయిందే” అన్న పరితాపం పట్టుకుంది. బాగా.

"క్షణశః కణశ శ్చ” అన్న సూక్తి యెంత విలువయిందో అప్పుడే నాకు బాగా అవగతం అయింది.

వొణికిపోయాను.

కూడిక వేస్తే లెక్కకి వచ్చే ఆ నెలా పదిహేనురోజుల్లోనూ నూరుపద్యాలయినా కట్టివుందు నాడుతూ పాడుతూ.

వసుచరిత్రా, ఆముక్తమాల్యదా - వంటి ఉద్గ్రంథం కొంతయినా చదివి యెన్నో విషయాలు తెలుసుకుని వుందును, చులాగ్గా.

వచన గ్రంథ మయినా వొకటి రాసేసి వుందును.

అంత విలవయిన కాలం వ్యర్థం అయింది.

243

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి