మా నాయనగారిలాగే తక్కిన యువకులూ అసాధారణ సాధన చేశారు.
వారికీ స్వాములవారిమీద కసే యాజులుగారిని వెలిపెట్టినందుకు.
ముహూర్తం సమీపించింది.
స్వాము లెప్పటికప్పు డంతా తెలుసుకుంటూనే వున్నారు.
ఎత్తులమీద యెత్తులున్నూ వేసుకుంటూనే వున్నారు.
ఆ సీమవారి చూపులన్నీ వేగేశ్వరపురంమీదే వున్నాయి.
ఇరుగుపొరుగు జిల్లాల పండితులున్నూ వేగేశ్వరపురం వార్తలకోసమే యెదురు చూస్తున్నారు వచ్చి వాలడానికి.
ముహూర్తం రానేవచ్చింది.
నరసింహయాజులుగారి పట్టుదలా, యువకుల దక్షతా, యాగవిశేషాలూ చూడ్డానికి అనుకోనివారున్నూ వందలూ వేలూ వచ్చి వాలారు వేగేశ్వరపురంలో బ్రాహ్మలు.
అన్నదానం భరద్వాజవిందును కాదనిపించింది.
ఋత్విక్కులు తాండవంచేశారు, ఉత్సాహోద్రేకాలతో.
యుక్తసమయాన, పండితులూ ఋత్విక్కులూ చుట్టాలూ వందలకొద్దీ అనిమిషులై ఆత్రంగా చూస్తూ వుండగా, అఖండ గోదావరీ ప్రవాహంవతుగా - గుక్కతిప్పుకోకుండా వీణ పలుకుతున్న ట్టాశ్వినం కానిచ్చి అప్పుడు కళ్ళుతెరిచారు. మా నాయనగారు.
ఆనంద ధ్వానాలతో యాగశాల ముఖరితం అయింది.
కొంత గ్రంథం అయాటప్పటికి మా నాయనగారికి నడ్డి నీలగ్గా, "నేనున్నాను బావా" అంటూ వెనక్కి వచ్చి తమ మోకాలు వీపు ఆనించి పొదువుకుని వుండిన యాజులుగారు “బావా" అని మాత్రమే మాట్టాడగలిగి గుచ్చికౌగిలించుకుని, ఆనందాతిరేకంతో మూర్ధాఘ్రాణమున్నూ చేసి, ఎవరో వొక జమీందారు తమ కాసందర్భంలోనే బహూకరించిన పసుపుపచ్చని జలతారు కాశ్మీరు శాలువు విప్పికప్పి బ్రహ్మానంద పరవశులయిపోయారు.
ఆ శాలువు ముక్కలు మొన్నమొన్నటిదాకా వుండేవి మా యింటో.
ఇప్పటి పురావస్తుసేకరణపద్ధతి మాకప్పుడేమీ తెలియదు, తెలిసేవుంటే ఆ ముక్కలే పంచుకుని సాలగ్రామాలన్నట్టు చూసుకుంటూ వుందుం మేము.
అది యేమయినా, చయనం దేవదుందుభులు మోగేటట్టిలా పూర్తి కాగా, యీ కోలాహలం గుండెలు బద్దలు కొట్టగా, స్వాములవారు, ఏనుగులూ లొట్టిపిట్టలూ గుర్రాలూ యెడ్ల బళ్ళూ తోలించుకుని రాత్రికిరాత్రే బయలుదేరి మరోసీమకి తరలిపోయారు, అంధకారావకుంఠనంతో.
తరవాత, ఆ విజయానందంతో అంతకంటే యెక్కువగా దీక్షపట్టి, డెబ్బయ్యి ద్దరు ఋత్విక్కులనూ స్వయంగా తయారుచేసుకుని అంతకంటేనూ ఘనంగా సర్వతోముఖయాగమున్నూ చేసి చయనులుగా రయివుండిన నరసింహయాజులుగారు, ఏలూరుపాటి నరసింహ సర్వతోముఖయాజులుగారున్నూ అయినా రచిరకాలంలోనే.
చెప్పవచ్చిందేమిటంటే?
విద్యార్థికే కనక పట్టుదల వుంటే, వొక పండితుడు కుచ్చితంగా ప్రవర్తించినంత మాత్రాన యేమీ దిగడిపోదు, ఆ పండితుని నైచ్యమే వెల్లడి అవుతుంది గాని.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
242