శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
అనుభవాలూ - జ్ఞాపకాలూను
రెండో సంపుటం
కులవిద్యలు నేర్చుకుని కూడాకూడా వుంటూ మా చిన్నన్నగారు మా నాయనగారికి మిక్కిలీ ప్రీతిపాత్రులయి వుండగా, వారికి తా మలా కాలేకపోయినా మా పెద్దన్నగారున్నూ కుల విద్యలతోనే సంతుష్టిపడి వుండగా, సన్నిహితులూ వ్యవహితులూ బంధువులున్నూ అందరూ వైదికవిద్యాప్రవీణులే అయివుండగా నాకొక్కడికే యెందుకు పట్టుకుందో మరి, ఇతరవిద్యల యెడల సుముఖతా తన్మూలంగా కులవిద్యల యెడల విముఖతా - ఇది ఇప్పటికీ తీరని సమస్యే నాకు.
ఆ యితర విద్యలున్నూ మా నాయనగారి కన్నీ ప్రతికూలాలే కావడమున్నూ అలాగ సమస్యే అయింది.
కాని, స్వాతంత్ర్యం ప్రారంభం అయినకొద్దీ - అది దృఢమున్నూ కాసాగినకొద్దీ - కులవిద్య లొక్కొక్కటే అశ్రద్ధ చెయ్యడంతోపాటు కొత్తవిద్య లొక్కొక్కటే సాధన చేసుకోడమున్నూ ప్రారంభించా న్నేను, అప్పటప్పటికే కాలాతీతం అయిపోయిందన్న కటకటతో.
నేనలా ప్రారంభించిన యితరవిద్యల్లో సంగీతం వొకటి.
సాధన చేసుకుంటున్న కవిత్వం యెంత యిష్టమో, అచుంబిత ప్రక్రియ అయిన సంగీతమన్నా అంత యిష్టమే నాకు.
గాత్రం కాస్తయినా మంచిదయితే చాలు, యేమాత్రం పాటవినపడ్డా యెంతో హాయిగా వుంటుంది నాకు.
అయితే, ఆ చిన్నతనంలో కూడా వొక్కొక్కపాట చెవిని బడితే యెంతో బాధ అనిపించేది నాకు.
దానిక్కారణం మాత్రం బోధపడేదికాదు.
ఈ స్థితిలో, గోదావరీపుష్కరాల సందర్భంలో రాజమహేంద్రవరంలో మానేపల్లి
213
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి