"ఏదీ, మీ అబ్బాయి వూహించినట్టు మీ రూహించండి, చూతాం" అంటూ పందెం వేశారుట.
"సిద్ధాంతిగారూ, నేటికి మీ పూర్వుల తపస్సంతా ఫలించింది. మీ కడుపున వంశోద్ధారకుడు పుట్టాడు" అంటూ మెచ్చుకున్నారుట వెళ్ళివెళ్ళి.
"ఇవాళ చిన్నతనం, ప్రౌఢవయస్సు రానివ్వండి, మీవాడు వోహో అనిపించుకుంటా డెక్కడికి వెళ్ళినా. అతని పేరు శాశ్వతం అయిపోతుంది. అతని సూక్తులు వేదవాక్కులుగా మననం చేసుకుంటూ వుంటుంది లోకం" అన్నారుట.
నన్నయ్య, తిక్కన్న, యెర్రన్న, పోతన్న - మొదలైన మహాకవుల గోష్ఠి ఆయనకు తరుచు.
కవిత్వం అంటే యేమిటో ఆయనకు తెలుసు.
అలాంటి రసికు లాయన, నిండు కుండాను, వోటిమాటలు రావలాంటివారికి; కాని వాటిలో వొక్కమాటా నాకు చెల్లదు.
అయితే, దాంతో డంగయిపోయారుట మా నాయనగారు మాత్రం.
“నాకూ వెర్రి సంబరం పుట్టుకువచ్చిందిరా అబ్బాయి” అన్నారు మా అమ్మగారున్నూ, ఇదంతా చెప్పి.
నే నొకందుకు సంతోషించాను.
చౌదరిగారి ప్రస్తావన, మా నాయనగారికి నా యెడల సద్భావం కలిగిస్తుందని నమ్మా న్నేను.
సరిగా అలాగే జరిగింది కూడా.
"కులవిద్య లెలాగా విడిచిపెట్టావు, ఆ కవిత్వం సంగతులన్నా కూలంకషంగా తెలుసుకో, నలుగురూ మెచ్చుకునేటట్టు చెయ్యి రచనలు" అంటూ ప్రోత్సహించసాగారు, మా నాయనగారు తరువాత్తరవాత, నన్ను.
63
మరోనా డింకో విశేషం జరిగింది, మా నాయనగారి ఆశీర్వచన బలంతో.
నే నింటో కూచుని పద్యాలు కట్టుకుంటున్నాను, బహిరంగంగా.
"నాన్నగారు పిలుస్తున్నా"రంది మా చెల్లెలు వచ్చి.
ఉదయం యెనిమిదిన్నర దాటి వుంటుంది, అరుగుమీద కూచుని యెవరితోనో మాట్టాడుతున్నారు, మా నాయనగారు.
చూడగా, ఆ మాట్టాడుతున్నవారు, అనపర్తి రెయిల్వే స్టేషన్ మాష్టరు పిళ్ళెగారు.
జాతకాలు చెప్పించుకోడం అన్నా, ప్రశ్నలు చూపించుకోడం అన్నా మహా యిష్టం, వారికి.
అందుకోసం, వారానికి రెండుమూడుమాట్లయినా పొలమూరు వచ్చేవా రాయన, మా నాయనగారి దగ్గరికి.
అది ఫ్లాగ్ స్టేషను కనక, వుదయం యేడున్నర బండి వెళ్ళిపోతే, మళ్ళీ పదకొండున్నర దాకా యెప్పుడూ తీరికే ఆయనకు.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
187