Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకుంటా రేమిటి, అంటున్నారు.

కవిని “సోమరి” అనడందాకా వెళ్ళిపోయారు, వారు.

ముక్కు కాదు, ఋషి మూసుకునేది, కళ్ళు.

కళ్లు అంటే చర్మచక్షువులు.

ఋషికే కాదు, అందరికీ వుంటాయవి, వాటినిబట్టి కాదు, వ్యవహారం.

శుద్ధ భౌతికాలు, అవి.

కనక, భౌతిక జగత్తే కనపడుతుంది, వాటికి.

భౌతిక వాసనలే రేపెడతా యని.

ఋషి - అంటే కవికి - ఆంతరదృష్టి వుంటుంది, బహుః నిశితం అది.

చర్మచక్షువులు మూసుకుని ఆ అంతరదృష్టితో చూస్తాడు కవి.

అదే క్రాంతదర్శనం.

లోకాలోకాలన్నీ దాని పరిధిలోనే.

అవి చూడగలిగినవాడికి - అంటే - సత్యం శివం సుందర మున్నూ అయినవి చూడగలవాడికి, ఇక్కడ యేం వుందీ ఆకర్షించగలిగేదీ?

అన్నగారు “దిగిరా” నన్నది ఆ పరిధిలోనుంచి.

వారు గ్లాస్కోపంచెలు కట్టడమే కనిపిస్తుంది, జనులకు.

పరిసరాలు చూస్తున్నట్టే వుంటాయి, వారి చర్మచక్షవులు.

వారి ఆంతర్యం మాత్రం ఆ దిగిరాని స్థితిలోనే వుంటుంది.

"సంవత్సరాని కారువేల రూపాయ లిచ్చుకుంటాం, కావాలంటే అడ్వాన్సుగా యిచ్చుకుంటాం” అంటూ వచ్చి రైతులు నన్ను తొందరపెడుతున్నారు: గాని, ఆ మహానుభావుడు మద్రాసునుంచి దిగిరాడు, భూములు ఆమరకం చేసుకోడానికి” అన్నారు వారి బంధువుల్లో వొకాయన, ఉత్తరాలు రాసిరాసి, విసిగి విసిగి.

ఏం, డబ్బు చేదా అన్నగారికి?

కవితా సమాధిలో వుండినప్పుడు చేదే కాదు, అధిక విషమున్నూ.

అన్నగారిదాకా వెళ్ళనక్కరలేదు, ఏమాత్రం కవి అయిన వాడికిన్నీ వుంటుంది, మొత్తానికి డబ్బంటే యిలాంటి వెగటు.

పోనీ, మద్రాసులోనైనా సరిగా చూసుకుంటారా అన్నగారు వ్యవహారాలు, ఈ రైతులు అక్కడికే వెడితే?

అదిన్నీ వొట్టిదే.

ఇక్కడ వుండినవారికి మద్రాసులో వుండినట్టు కనపడతారు గానీ, అక్కడా దిగీరాని స్థితే అన్నగారిది, మరి.

చెప్పవచ్చిం దేమిటంటే?

నా నాటకరచన అప్పుడే పూర్తి అయింది.

ఆ వుండిన డబ్బేమో యెన్నాళ్ళనుంచో వుంది.

అంటే డబ్బు పొంగు చల్లారింది, నాటకం పొంగు వుద్ధృతిలో వుంది, అప్పుడు.

అంచేత నాటకం బయటికి రావాలనిపించింది; గాని మళ్ళీ ఆ డబ్బు కూడుతుందో కూడదో అనిపించలేదు, నాకు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

183