ఈ పుట ఆమోదించబడ్డది
మీ రచన చదివి నాటి విద్యార్థుల వినయసంపదలో కొంతభాగమైనా సంపాదించగలిగితే - వాళ్ళసంగతి అలా వుంచండి, - ప్రస్తుత పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసే - కొన్నిచోట్ల (పాఠాలు చెప్పే) పంతుళ్ళు ఎంతో అదృష్టవంతు లవుతారు.
అసలు 'మంత్రాలంటూ ఉన్నయ్యా?' అనేదాకా వచ్చిందీ పాఠకలోకం. పత్రికలలో దానిపై ఉత్తరప్రత్యుత్తరాలు... 'రాచపుండు నయమైంది' అని వీళ్ళకు తెలియదో, కాక తెలిసి కూడా ప్రక్కవాళ్ళకు తెలియనీయకూడదనో - కొన్ని అధ్యాయాలు వెనక్కు వెళ్ళి మళ్ళీ చదువుకుంటూ వెళ్ళాను. విసుగు పుట్టలేదు. పూర్తి అయ్యాక మళ్ళీ ఒకసారి చదువుదామనిపించింది. వచన రచనలో మరలా చదువుదా మనిపించేవి చాలా కొద్ది. వాటిలో మీది మొట్టమొదటిది.
అందుకు, మీకు, నా హృదయపూర్వక నమశ్శతాలు.
మిక్కిలి వినయంగా నమస్కరిస్తున్నాను."
మురయా
(మునిమాణిక్యం రఘురామ యాజ్ఞవల్కి).
★★★
xviii
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి