10
".........నేను చదివినంతవరకూ మీ పుస్తకంలో నన్ను ఆకాశానికెత్తివేశారు. వాత్సల్యం కురిపించారు. అంతపొగడ్తకు నేను తగను. మీపై, మీ రచనలపై నాకు గల అభిమానం చేతనే మీచేత ఆనాడు 'నవోదయ'లో అనుభవాలూ జ్ఞాపకాలూ వ్రాయించడానికి నేను నిమిత్తమాత్రుడనైనాను, అంతకుమించి నేను చేసిన ఘనకార్య మేదీ లేదు. అయినా మీరు తలపెట్టిన నాలుగు సంపుటాలూ వస్తే ఆ మహానందంలో నేనూ పాల్గొంటాను."
నీలంరాజు వేంకటశేషయ్య.
11
"మీ అనుభవాలూ జ్ఞాపకాలూ ఆమూలాగ్రంగా చదివాను. అది అనుభవజ్ఞానానికి నికషోపలంగా తోచింది. అందులో విద్యార్థిదశను వివరించు ఘట్టములు చాల ముచ్చటగా నున్నవి. ప్రతి చిన్న సన్నివేశము జ్ఞాపకముండో, లేదా జ్ఞాపకము చేసుకొనో చిత్రించినట్లే కనిపిస్తుంది గాని కృతకంగా లేదు. భాషా పాటవము, సమ్యక్పరిశీలన, వివేచనాశక్తి సమగ్రంగా పరిస్ఫుటమగుచు పాఠకులపై ప్రసరిస్తున్నాయి. మీ రచనను గురించి యింతకన్న చాల యెక్కువగా వ్రాయాలిసివుంది. కాని అనవకాశకారణంగా విరమిస్తున్నాను. ఆశీర్వదించండి."
చిలుకూరి లక్ష్మీపతిశాస్త్రి.
12
"మీ అనుభవాలూ జ్ఞాపకాలూ చదివాను. వారాలు చేసుకొని చదువుకొన్ననాటి అనుభవాలు, విద్యార్థులమధ్య వుండే పోటీలు, వైదునస్యాలు నా మనస్సుకు హత్తుకుపోయాయి. వైదికకుటుంబాలలో తెలుగు భాషమీద వుంటూవచ్చిన నిస్సాకారం, అసహ్యం మొదలయినవి మాకు అనుభవం కాకపోయినా వాటినుంచి గతచరిత్ర తెలుసుకొనే అవకాశం ఏర్పడుతుంది. రచననుగురించి నేను చెప్పడాని కేముందీ, మీరు సిద్ధహస్తులు... మీ రచనావిశిష్టత చదివేవారిని నిల్చోనివ్వదు. మిగిలిన భాగాలు కూడా తెనుగుదేశం త్వరలోనే చూడగలదని ఆశిస్తున్నాను.”
మహీధర రామమోహన్.
13
".....పూజ్యపాదులు బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి 'చిన్నకథలు' 'నాటకాలు' ఇటీవల వెల్వడిన వారి 'అనుభవాలూ జ్ఞాపకాలూను' క్షుణ్ణంగా చదివాను. ఇతరుల గ్రంధాలూ చూచాను కాని శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రిగారి కూర్పులో ఒక క్రొత్తదనం ఒక జాతీయతా ఒక ప్రత్యేకతా ఒక విశిష్టతా అడుగడుక్కీ గోచరిస్తాయి. వారి రచనల్లో ఉపయోగింపబడే మధురమంజులమనోజ్ఞ పదజాలం తెచ్చిపెట్టుకొన్నట్టు గాక సహజంగా సన్నివేశ సందర్భాల కనుకూలంగా సాగిపోతుంది. వారి కావ్యసృష్టిలో పాత్రలు సజీవంగా ప్రత్యక్షమౌతాయి. మోతాదు తప్పని కసోత్పత్తితో పాఠకలోకాన్ని పరవశుల్ని చేస్తాయి. ప్రతి పాత్రలోనూ కవియొక్క తాదాత్మ్యం స్థోరక మౌతుంది.
'పద్యంలోనే పసందు ఉం'దని అనుకునే ప్రాతకాలపు నమ్మకాలు శ్రీశాస్త్రిగారి వచనరచనాసమీక్షలో సంస్కారం పొంది 'గద్యమే హృద్య'మని ఘంటాపధంగా చాటి చెప్పుతారు. వారి
అనుభవాలూ - జ్ఞాపకాలూను
XV