శోభనం అనరు, గర్భాధానం అనేమాట సకృతుగా వాడతారు. తరుచు వారు వాడే శబ్దం పునస్సంధానం.
మంచినీళ్ళు అంటే పామరత్వం, మంచితీర్థం అనాలి.
వైదికవిద్య లన్నీ సంస్కృతంలో వున్నాయి కనక, అవి నేర్చుకుంటే ప్రాయికంగా సంస్కృతం నేర్చుకోడమే అవుతుంది కనక, వారి దృష్టిలో సంస్కృతం వొక్కటే పవిత్ర మైన భాష.
పవిత్రమైనది మాత్రమే కాదు, దేవతల భాషే అది.
తాము భూసురులు కనక, బ్రాహ్మ లదే నేర్చుకోవాలి.
కనక, పండితు డంటే సంస్కృతపండితుడే పండితుడు.
కవి అంటేకూడా సంస్కృతకవే కవి.
ఇది వైదికుల సిద్ధాంతం.
కనక, తెనుగులో కవిత్వం చెయ్యవద్దని నాకు ఆంక్ష
పైపెచ్చు, వైదికవిద్యలు కొంచెం నేర్చి, కొద్దో గొప్పో సంస్కృతమున్నూ అభ్యసించి వుండిన నేను తెనుగులో రచన చెయ్యడం కులం చెడ్డమే.
కాగా “నువ్వు వాణ్ణి పాడుచేస్తున్నా "వని మా పెద్దన్నగారిని గట్టిగా మందలించారు, మా నాయనగారు.
బహు సున్నితమైన మనస్తత్వం మా పెద్దన్నగారిది.
హద్దుదాటేవారు కా రాయన.
ఎదుటివారు దాటితే అంగీకరించేవారు కారు.
అది తమ సొంతానికి అపాయకర మయితే ప్రతిఘటించేవారు, లేకపోతే ఆ మనిషిని తప్పించుకుని తిరిగేవారు.
నా తత్త్వమున్నూ యిదే మొదణ్ణుంచీ.
అంచేత, మా పెద్దన్నగారికి, నా రుచి కనిపెట్టి చదువు చెప్పడమే అగత్యం అయింది; గాని నా చదువు విషయమై మా నాయనగారితో వివాదపడవలసిన అగత్యం లేకపోయింది.
దీంతో, నా విషయం పట్టించుకోడం మానేశా రాయన.
నే నేకాకి నయిపోయాను.
అయినా నేను జంకా లేదు, వెనుదియ్యా లేదు.
సరిగా యీ స్థితిలో, మా యింటో, కుటుంబ కలహాలు ప్రారంభం అయినాయి.
34
అప్పటికి, మా పెద్దవదినగారూ, మా చిన్నవదినగారూ మాత్రమే కాపరాలకు వచ్చి వుండినారు.
చిన్న వదినగారు వచ్చిన కొద్ది దినాలకే తోటికోడళ్ళలో పొరుపులు పుట్టాయి.
అవి పురుషుల దాకా పాకాయి.
వాటికి మా పెద్ద అక్కగారి మంత్రాంగ పుద్ధృతి కలిగించింది.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
105