చిలవలు పలవలూ పెంచి.
దానిమీద "నిన్ను తెనుగు పుస్తకాలు ముట్టుకోవద్దంటే తెనుగులో రచనే ప్రారంభించావూ?" అంటూ చాలా గట్టిగా మందలించారు గురువుగారు నన్ను.
సుబ్రహ్మణ్యశాస్త్రిమీద నాకు చాలా కోపం వచ్చింది.
మొదటిమాటు, మర్నాడు, మేమిద్దరమూ ఘర్షణపడ్డాము.
ఆ సంగతీ చెప్పాడు గురువుగారితో, అతను.
అప్పుడే అనుకున్నా న్నేను "మా యిద్దరిలో వొకరి కక్కడ వుండే యోగం లేదా?" అని.
ఆ సందర్భంలో, రామసోమయాజులూ, సర్వేశ్వరచయనులూ అతణ్ణి మందలించారు.
దానిక్కారణమున్నూ నా కాతానే జమకట్టా డతను.
అసలు పగ ప్రారంభం అయింది.
మే మిద్దరమే రకరకాలుగా సాధించుకునేవాళ్ళం, లోపాయికారీగా.
గురువుగారి యింట నాకు వారం వుండేది.
ఒకనాటి రాత్రి, భోజనాత్పూర్వం, నడవలో దీపం దగ్గిర కూచుని నేను ఆవేళ చెప్పుకున్న శ్లోకాలు చూసుకుంటున్నాను, నాలో నేను.
అక్కడికి కనపడుతూ, వసారాలో కూచుని, వంటచేస్తున్న పెద్దకోడలికి సలహాలు చెబుతోంది, గురువుగారి తల్లి.
అలాంటప్పుడు, పిల్లిలాగ వెనకనే మెల్లిగా వచ్చి "భో" అంటూ అరిచాడు సుబ్రహ్మణ్యశాస్త్రి, చెవిలో.
నే నులిక్కిపడ్డాను.
చెవిలో కూడా బాధ కలిగింది.
అయినా, వొకవిధంగా నే నదృష్టవంతుణ్ణి.
ఏమంటే?
అది గురువుగారి తల్లి చూసింది.
అతణ్ణి మందలించనూ మందలించింది, గట్టిగా.
నాకు మాత్రం వల్లమాలిన రోషం వచ్చేసింది.
బదులుతీర్చా లనుకున్నాను, యథాపూర్వంగానే.
ఒక వారం గడిచింది.
పెద్ద వాన కురిసింది, వొకనాడు.
రెండు దినాలకు నేల ఆరింది; కాని రబ్బరులాగ కాస్త మెత్తగానే వుంది, యింకా.
ఆ రాత్రి వూళ్ళో భోజనం చేసి బసకి - గురువుగారి యింటికి వస్తున్నా న్నేను.
కటికి చీకటి.
నా దగ్గిర, వొకచేత పట్టుపంచా, వొకచేత కర్రా వున్నాయి.
కర్ర అంటే విశేషం యేమీ లేదు, అది వెదురుది, బొంగుదిన్ని.
బయటికి వెళ్ళి వస్తున్నా డాసమయావ సుబ్రహ్మణ్యశాస్త్రి, కాలవగట్టునుంచి.
ఏదో గొణుక్కుంటున్నట్టు మాట్టాడుతున్నాడు, దాంతో గుర్తుపట్టా నతణ్ణి.
"ఇదే సమయం" అనుకున్నాను, బదులు తీర్చడానికి.
82
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1