పుట:AntuVyadhulu.djvu/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

పురుగు పిల్లలు బయలుపడి .....; పొట్ట గోడ గుండ చొరుచుకొని ప్రయాణం చేసి మన శరీరము నందు చెమట వచ్చు రంద్రముల ద్వారా శరీరములోనికి ప్రవేశించు నని కొందరి అభిప్రాయము. ఒకానొక పరి శోధకుడు అరటి పండ్లలో నారి పురుగులను పెట్టి కొన్ని కోతులకు తీనిపించగా అందులో ఒక కోతికి తొడ మీద వాపును నొప్పియు ప్రారంభమయ్యెను. ఆకోతి అటు పిమ్మట తొమ్మిది మాసములలో చచ్చి పోయెను. ఆప్పుడు దాని తొడమీది కంతిని కోసి చూడగా సర్వ విధముల నారి పురుగును పోలి యుండిన పురుగు దానిలో కనపట్టి యుండెను. కాని దాని పొడుగు 16 అంగుళములు మాత్రమే యుండెను. ఈనిదర్శనము వలన నారి పురుగు పిల్లలు మన ఆహార పదార్థముల మూలమున కూడ ప్రవేశింప వచ్చునని తోచు చున్నది. ఈ విషయమై ఇంకను శోధనుము చేయ వలసి యున్నది.

ఎట్లయినను నారి కురుపుల వ్వాపకము గల ప్రదేశములో నివశించు వారలందరును తాము త్రాగు నీళ్లను మరగ కాచు కొని త్రాగవలెను. ఇట్లు చేయుటచే నీళ్లలోనారి పురుగు పిల్లలున్న యెడల చచ్చి పోవను. స్నానము చేయు నీళ్ళను కూడ సాద్యమైనంత వరకు మరగ కాచి చల్లార్చుకొనుటయే మంచిది.