పుట:AntuVyadhulu.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

రెండు జతల కాళ్ళకు చేప పొలుసుల వంటి ముండ్లుండును. ఇది చర్మము లోపలకు తొలుచుకొని పోవునపుడు దీని ముందరి కాళ్లు యందుండు ముట్టెలు సహాయము చేయును. ఆడుదాని కడుపులో ఒకటి గాని హెచ్చుగ గాని గ్రుడ్లుంను.

మగది సామాన్యముగా ఆడుదానిని పోలి యున్నను ఆడుదాని కంటె చిన్నది. వెనుక భాగమందుండు కాళ్ళలో చివర జతయందు ముండ్లుకు బదులుగా ముట్టెలుండును. ఈ ముట్టెలు సంయోగ సమయమున సహాయ పడును. వీపు మీద వెనుక భాగమున మధ్య రేఖలో గుర్రపు లాడము వంటి ఆకారముగల ఒక నిర్మాణములో వురుషాంగముండును. ఆడుది అంగుళములో 75 వంతు పొడుగును అంగుళములో 100 వ వంతు వెడల్పును గలిగి యుండును . మగది అంగుణలులో 125 వంతు పంతు పొడుగును 150 వంతు వెడల్పును గలిగి యుండును.

ఆడు గజ్జి పురుగు కడుపుతో నున్నప్పుడు చర్మములోపల కొక మార్గమును తొలుచుకొని పోవుచు తాను పోవు మార్గము యొక్క వెనుక భాగమున గ్రుడ్లను, మలమును యొకానొక విధమైన విషమును విడుచు కొనుచు పోవును. కాని దానికి కావలసిన గాలి నిమిత్తమై ప్రతి దినము చర్మము పైకొకసారి రంద్రము చేసికొని వచ్చి పీల్చుకొని పోవును. దీనికి మన వలె ముక్కును ఊపిరి గొట్టమును లేవు. దీని శరీర మంతట ఉండు సన్నని రంద్రముల గుండా ఇది గాలిని పీల్చు కొనును