పుట:AntuVyadhulu.djvu/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

203

లోనున్న దద్దు ఇన్ ప్లూయింజాలో నుండదు. ఒక వేళ చెమట వలన కలిగిన పొక్కులుండినను అది దద్దుమాదిరి నుండదు.

వ్యాపించు విధము

బెర్లిన్ పట్టణ వాస్తవ్యుడగు షేపర్ అను నతడు ఇన్ ప్లూయింజా జ్వరమును కలిగించు సూక్ష్మ జీవిని కనిపెట్టెను. ఈ సూక్ష్మ జీవి యెండవలన అయిదు నిముషములలో చచ్చి పోవును. ఈ జ్వరము వచ్చినపుడు సామాన్యముగా ఇంటిలో ఒక్కని కూడ విడువదు. పిల్లలు, పెద్దలు అందరును దీనికి సమానమే. 1891 వ. సంవత్సరమున ఈ వ్యాధి చీనా దేశమున బుట్టి, పసిఫిక్ సముద్రము మీదుగా అమెరికాకు పోయి, అచ్చటనుండి ఐరోపాకు వ్యాపించెను. ఇట్లు ప్రపంచమునందంటను వ్యాపించిన దీని వ్యాపకమును గూర్చి మూడు సిద్ధాంతలులు కలవు. గాలిలో నుండు దుమ్ము నాశ్రయించి తుపానులును పెద్దగాలియు వచ్చి నపుడు ఈ జ్వరమును బుట్టించు సూక్ష్మ జీవులు ఒక దేశము నుండి మరియొక దేశమునకు వెళ్ళునని కొందరును, వ్యాధికి కారణముగాని సూక్ష్మ జీవులు కావని మరి కొందరును, మశూచికము పొంగు మొదలగు వ్యాధుల వలే ఒక రోగినుండి మరియొక రోగికి ఏదో ఒక విధమైన సంపర్కము మూలముననే వచ్చునని మరి కొందరును చెప్పుచున్నారు. సామాన్యముగా ఒక మనిషి నుండి మరియొక మనిషికి సమీప సంపర్కమున్నపుడే ఇది హెచ్చుగ వ్యాపించు చున్నట్లు తోచు చున్నది. కాని ఒక