పుట:AntuVyadhulu.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

వేసవి ప్రాంత మందు అధికముగ వ్యాపించును. చలి కాలము రాగానె తగ్గి పోవును. సముద్ర ప్రాంతములందును, పల్లపు భూముల యందును ఈ వ్యాధి మిట్ట ప్రదేశములలో కంటె హెచ్చుగ నుండును. మురికి వీధులును, జన సంఘములు గల పెద్ద పట్టణములలో ఇది మొట్టమొదట పుట్టి రహ దారీల వెంట అప్పుడప్పుడు పల్లెలకు చేరు చుండును. అన్ని వయసుల వారును స్త్రీలును, పురుషులును కూడ ఈ వ్యాధికి సమానులే. ఈ వ్యాధిని గలిగించు సూక్ష్మ జీవి ఇంకను నిశ్చయముగ తెలియ లేదు.

నివారించు పద్ధతులు

సాధ్యమైనను కాకున్నను, రోగిని ప్రత్యేక పరచుట, రోగి యుండు గదులను శుభ్రముగను వెచ్చగను చక్కని గాలి ప్రసరించునట్లు జేయుట, రోగి యుపయోగించిన బట్టలను వస్తువులను వెనుక ప్రకరణములలో చెప్పిన ప్రకారము శుద్ధి చేయుటకు ఇవియే ఈ వ్యాదిని వ్యాపింప జేయకుండుటకు ముఖ్య సాధనములు.

న్యూమోనియా (Pneumonia)

ఊపిరి తిత్తులు కఫ సంబంధమైన పదార్థములతో నిండి పోయి అకస్మాత్తుగ జ్వరము, ఊపిరాడక పోవుట మొదలగు లక్షణములతో సామాన్యముగ తొమ్మిది దినములుండు జ్వరమునకు న్యూమోనియా జ్వరమని పేరు. ఈ వ్యాధి జంట