పుట:AntuVyadhulu.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

199

దగ్గు గలవారిని కూడ ప్రత్యేక పరచి వ్యాధి గ్రస్తులుండు స్థలమును శుద్ధి చేయ వలయును. బడి పిల్లలలో ఈ వ్యాధి వచ్చిన యెడల వ్యాధి పూర్ణముగ నయమగు వరకు బడికి రానీయ కూడదు. ట్రాంబడ్ల లోనికిని, రైలు బండ్లలోనికిని, సభల లోనికిని వ్యాధి గ్రస్తులను రానీయ కూడదు. ఇంటి వారలును వైద్యులును వ్యాధిని అధికారులకు ప్రకటన చేయునట్లు చట్టము లేర్పడ వలెను. ఈ వ్యాధి అంటుటకు సమీప సంపర్కము అవశ్యముగ తోచు చున్నది గాన ఇరుగు పొరుగు ఇండ్ల పిల్లలను కోరింత దగ్గు గల పిల్లలతో ఆట్లాడ నీయ రాదు. కోరింత దగ్గు గల పిల్లలతో సంపర్కము గల పిల్లలను బడులలో చేర్చుకొనక పూర్వము పదునైదు దినముల వరకు శోధనలో వుంచ వలెను.

డెంగ్యూ జ్వరము

అకస్మాత్తుగ కీళ్లలోను, కండలలోను అమితమగు నొప్పితోను శరీర మంతయు ఒక విధమైన ఎర్రని దద్దుర్లతోను గూడిన మూడు నాలుగు నాళ్ళ జ్వరమునకు డెంగ్యూ జరమని పేరు. ఇది రోగిని బాధ పెట్టును గాని చంపదు. ఇది కొన్ని దేశములలో అప్పుడప్పుడు వచ్చు చుండును. కాని 1877 వ సంవత్సరము మొదలుకొని మూడు సారులు ఇది ప్రపంచమంతయు వ్వాపించినది. ఇన్ ప్లూయింజా జ్వరము తప్ప ఇంత వేగముగను ఒక్కొక్క ప్రదేశములో ఇంతమందికి ఒకటే సారి వ్యాపించు నట్టి జ్వరము మరొకటి లేదు. ఇది సామాన్యముగా ఉష్ణ ప్రదేశములలొ