పుట:AntuVyadhulu.djvu/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

197

కందరకును రావచ్చును. ఇది రోగి యొక్క సమీప సంపర్కము లెక పోయినను, అనగా రోగిని తాకక పోయినను, ఒకరి నుండి మరియొకరికి అంటును. వాని చక్కగా గాలి ప్రసరింప నట్టియు తేమ గలిగి నట్టియు ఇండ్లలో దీని వ్యాపకము హెచ్చుగ నుండును. తట్టమ్మ వచ్చి పోయిన పిమ్మట గవదలు వచ్చుటయు ఒకానొకప్పుడు గలదు. ఒక సారి గవదలు వచ్చి పోయిన పిమ్మట తిరిగి సామాన్యముగా రాదు. ఈ వ్వాధి గవదలు ఉబ్బక పూర్వము కొన్ని దినములు ఉబ్బిన తర్వాత మూడు నాలుగు వారముల వరకును, అనగా ఉబ్బు పోయిన తర్వాత పది పండ్రెండు దినముల వరకును రోగి నుండి ఇతరులకు ఈ వ్యాధి అంట వచ్చును.

నివారించు పద్ధతులు

ఈ వ్వాధి నుండి సామాన్యంగా చావరు గనుక పరజలను శానిటరీ అధికారులును గూడ దీని విషయమై అంతగా లెక్క చేయరు. అయినను బడి పిల్లలలో ఈ వ్యాధి కనుపించిన యెడల వారలను వ్యాధి సోకిన దినము మొదలు ఇరువది నాలుగు దినముల వరకు బడికి రానీయ కూడదు.

కోరింత దగ్గు

కోడి పిల్లలను నులిమినట్లు నులిమి వేయుచు కో అను దీర్ఘస్వరముతో వచ్చు దగ్గుతో దీనిని అందరు సులభముగ గుర్తింప వచ్చును. గాలితో గాని ఋతువుతో గాని ఈ వ్వాధికి సంబంధమున్నట్టు కానరాదు. ఈ వ్యాధిని వ్యాపింప జేయు సూక్ష్మ జీవికి మానవ శరీరము గాక వేరెక్కడను నివాస స్థానము