పుట:AntuVyadhulu.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

193

ఫలాన వ్యాధి యని తెలియక పోవుట చేత పిల్లలు బడిలో ఒండొరుల తాకుట వలనను ఇది పిల్లలలో మిక్కిలి వ్యాపించును. వ్యాధి వచ్చిన ప్రతి వారిని చక్కగ గాలియు వెలుతురును వచ్చు నట్టియు ఇంటిలో విస్తారము సంబంధము లేనట్టియు ఒక గదిలో రోగిని ప్రత్యేక పరచిన యెడల సామాన్యముగా ఈ వ్వాధి ఎతరులకంటదు. బట్టలు పుస్తకములు, ఆట బొమ్మలు, ఇతర సామానులు ఇవి రోగి నుండి తీసిన వెంటనే ఎండలో నుంచి గాని మరియొక విధముగా గాని శుద్ధి చేసిన యెడల ఎండ చేతను గాలి చేతను దీని సూక్ష్మ జీవి చచ్చునదగుట చేత ఈ వ్వాధి అంతగా వ్యాపింపదు. కాని ఒక్క గదిలో నివసించి నంత మాత్రము చేత ఈ వ్యాధి ఎంత సులభముగ అంటుకొనునో ఈ క్రింది ఉదాహరణము వలన తెలియ గలదు. ఒక బడిలోని ఇరువది ఇద్దరు పిల్లలు విహారార్థమొక ఊరికి పోయి అచ్చట ఒక యింట నొక రాత్రి నిద్రించిరి. మరుసటి వారములో ఆ 22 మంది పిల్లలలో 21 మందికి తట్టమ్మవారు వచ్చెను. కారణము విచారింపగా విహారార్థమై పోయి యున్న రాత్రి వారు పరుండి యున్న ఇంటిలోని పిల్లావాని కొకనికి ఆ తట్టమ్మ వారు సోకి యున్నట్టు తెలిసెను. ఇప్పుడు తట్టమ్మ వచ్చియుండని పిల్లవానికి ఇది వరకే ఒక సారి తట్టమ్మ వచ్చి పోయెననియు తెలిసెను.

నివారించు పద్ధతులు

1. వైద్యుడును ఇంటి యజమానియు వెంటనే గ్రామాధికారికి ప్రకటన చేయ వలెను.