పుట:AntuVyadhulu.djvu/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

మన దేశమునందు ఈ వ్యాధి సర్వ కాలముల యందును ఆశ్రయించి యుండుటచే మనలనంతగా బాధించుట లేదు. ఇది ఏటేట వచ్చుచు పోవు చున్నను మరణములు మాత్రము మిక్కిలి అరుదు. మిక్కిలి ఎండ తీవ్రముగల ప్రదేశములలో ఎట్లో అతి శీతలములగు ప్రదేశములలో కూడ నట్లే ఈ వ్యాధి వ్యాపించు చుండుత చేత దేశముల యొక్క శీతోష్ణ స్థితికీని దీని యొక్క వ్యాపకమునకును సంబంధము లేనట్లు తోచు చున్నది. ఈ వ్యాధి నల్ల వార్లకును, తెల్ల వార్లకును కూడ ఒకటే విధముగ వ్యాపించును. స్త్రీ పురుష వివక్షత గాని పిన్న పెద్దల వివక్షత గాని దీనికి ఉన్నట్లు తోచదు. అయినను మన ఇండ్లలో సాధారణముగా పెద్ద వారల కంటె పిల్లలను ఇది అంటు చున్నట్లు కనబడును. ఎందు చేతననగా ప్రతి దేశమునందు అప్పడప్పుడు ఈ వ్యాధి వచ్చి పోవు చుండుట చేత పెద్దలందరకు ఈ వ్యాధి ఎప్పుడో ఒకప్పుడు సోకి యుండును. అందుచే ఈ వ్యాధి క్రొత్తగ వచ్చినపుడెల్ల అనేకమంది పిల్లలును ఇది వరకు రాక మిగిలి పోయిన కొందరు పెద్ద వార్లును ఈ వ్యాధికి లోబడుదురు. ఆరు మాసములకు లోపు వయసుగల పిల్లలకును నలుపది సంవత్సరముల వయసు మీరిని పెద్దలకును ఈ వ్యాథి అంటుట అరుదు.

ఈ వ్యాధి సామాన్యముగా మరియొక రోగి యొక్క సమీప సంపర్కముచే వచ్చును. ఇది ఒంటి మీద దద్దులు లేవక పూర్వమే ఇతరులకు అంటుకొను స్వభావము గల దగుట చేత