పుట:AntuVyadhulu.djvu/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

ఆహారము మూలమున గాని మన కడుపులో ప్రవేశించుట వలన ఈ వ్యాధి వచ్చు చున్నదని పైన చెప్పి యుంటిమి. కలరా వచ్చిన వాని విరేచనముల లోను, వాంతుల లోను, పేగుల లోను, ఈ సూక్ష్మజీవి ఎల్లపుడు కనబడు చుండుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. కలరా వచ్చి కుదిరిన కొందర రోగుల విరేచనములలో ఈ సూక్ష్మ జీవులు ఏబది దినముల వరకు ఉన్నట్లు కనిపెట్టబడినది. కలరా సూక్ష్మ జీవులు పులుపు పదార్థములలో జీవింపవు. సల సల క్రాగు నీళ్లలో ఇవి శీగ్రముగ చచ్చి పోవును. మనము చేయి పెట్టలే నంత వేడిగా నుండు నీటిలో అరగంటలో చచ్చి పోవును. ఎండకివి బొత్తిగా తాళజాలవు. కాని తడిలోనున్న యెడల ఎంత కాలమైనను జీవింప గలవు. తడి నేలలో గాని మురికి నీటిలో గాని తడి బట్టలో గాని ఇది మిక్కిలి వేగముగ వృద్ధి పొందును. దీనికి ఆహార మంతగా అక్కర లేదు. మిక్కిలి పరిశుబ్రమైన నీళ్లలో సహితము కొంత కాలము ఇది జీవింప గలదు. ఇది మురికి నీళ్లలోను మట్టి నీళ్లలోను ప్రవేశించిన యెడల అనేక నెలలును బహుశః సంవత్సరములును కూడ జీవింప గలదని చెప్ప వచ్చును. ఎండ వలన వృద్ధి తగ్గి తడివలనను బురద వలనను వృద్ధి హెచ్చు నట్టియు స్వభావము గలదగుట చేతనే ఈ వ్యాధి కొద్ది వర్షములు కురిసిన వెంటనే మనదేశమునందు హెచ్చుగ వచ్చుచుండును. అధిక వర్షముచే ప్రదేశమంతయు జలమయమై యున్న