పుట:Annamacharya Charitra Peetika.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

93 శాసనములఁ జెక్కించుకోలేదు. ఆయూ దాతలిచ్చిన యీవులను బ్రతిగృహీత యగుదేవునికిఁ జెల్లింతు మని దేవస్థానస్థానపతులు బాధ్యత వహించి యుభయులకు నమ్మికగా శాసనములఁ జెక్కించిరి. దానికి 'శ్రీవైష్ణవరక్ష' వెట్టిరి. తిరుమలాచార్యులనాఁడు శాననములఁ జెక్కించినయుద్యోగి తిరుని నార్ వుడయుE. స్వామిపుష్కరిణికడ మాత్రము పెదతిరుమలాచార్యుఁ డొకతెలుఁగుశాసనము వేయించుకొనెను. పద్యరూపముగా(గూడ నది తాళ్ళపాక సూర్యనారాయణయ్యగారి ప్రాఁత కాగితములలో నున్నది. అది యిది: సీ. శ్రీశాలివాహనాంచితశకాబ్దము లెన్న నిల వేయునన్నూఁట యేఁబదియును నాలవయేఁడగు నందనవత్సర వైశాఖ పూర్ణిమావాసరమున శ్రీ వేంకటాధీశ శృంగారసంకీర్త నాచార్యతాళపాకాన్నమార్య పుత్రతిమ్మార్యుండు పూర్వపుఁగోనేఱు కట్టించె నవశిలాకలితముగను తత్తటాంకణగోపురద్వారములను భువనసన్నుతుఁడైనట్టి భూవరాహ ఘనుని తిరుచుట్టమాలె ప్రాకారవరము తానె కట్టించె నాచంద్రతారకముగ. నేఁటి తాళ్ళపాక వారు తిరుపతిలో స్వామికి సంకీర్తనకైంకర్యము జరుపుచుఁ దాళ్ళపాక శేషాచార్యులగారు కుటుంబవృద్ధితో నున్నారు. మడితాడు గ్రామవాసి, సూర్యనారాయణయ్యగారు చిన్నన్న కోవలోనివారట. నేఁడు తిరుపతిలోనె వైద్యాదివృత్తులతో సకుటుంబముగా నున్నారు. వీరే తాళ్ళపాకవారి పూర్వగాథలకై చాల శ్రమించుచున్నవారు. అన్నమాచార్యుల దేవతార్చన విగ్రహాదులను మంగాపురమునకుఁ చేర్చినవారు వీరే. ఇంకను