92
తిరువెంగళప్ప
ఈతఁడు గొప్పవిద్వాంనుఁడు అమరుకావ్యమును దెలిఁగించినాఁడు. నామలింగానుశాసనమునకుఁ దెలుఁగువ్యాఖ్య రచించినాఁడు. కావ్యప్రకాశికకు వ్యాఖ్య రచించినాఁడు. క్రీ. 1554లో అంబత్తూరు తూప్పిల్ అగ్రహారములలో కొంతభాగము తిరుపతి గోవిందరాజస్వామి పెండ్లి తిరునాళ్ళు జరపించుటకుగా సమర్పించినాఁడు. క్రీ 1553లో చినకంచిలో అరులాళప్పెరుమాళ్ళకు పల్లాత్తంజేరి పేరీచ్చంబాకము అను గ్రామము లిచ్చినాఁడు.[1]
తిరుపతి శాసనములు
తిరుపతి దేవస్థానశాసనము లెల్ల నరవముననే కలవు. సర్వస్వతంత్రుఁడు దక్షిణాపథమునకెల్ల సార్వభౌముఁడును గాన యొక్క శ్రీ కృష్ణదేవరాయఁడు మాత్రము గుడిలో సంస్కృతకర్ణాటాంధ్ర ద్రవిడములలోఁ దనశాసములఁజెక్కించుకోఁ గలిగెను. తిరుమల తిరుపతి దేవస్థానమున గుడిగోపురములలోఁ దాళ్లపాకవారి శాసనములు నరవముననే యున్నవి. తిరుమల కొండక్రిందనే తాళ్ళపాకవారి యగ్రహారముగా నున్నమంగాపురమునఁదాళ్ళపాక చినతిరుమలాచార్యుఁడు తాను గట్టించిన కళ్యాణ వెంకటేశ్వర దేవాలయమున శాసనము లన్నింటిని తెలుఁగుభాషలోఁ దెలుఁగులిపిలోనే చెక్కించెను. శుద్ధాంద్రులయిన మహనీయులు సాళువతిమ్మన, గోవిందన, బయకారరామయ మొదలగువారు శ్రీస్వామివారి కర్పించిన యగ్రహారాదుల శాసనములుగూడ ద్రవిడముననే ద్రావిడీకరణముఁబడసిన పేర్లతోనే యున్నవి. శాసనము లెల్ల ద్రావిడముననే యుండుటకుఁ గారణము దేవస్థానస్థానపతులు ద్రావిడు లగుటయే. గుడిలో శాసనములఁ జెక్కించుట కధికారులు వారే. తిరుమలాచార్యాదులు పదులకొలఁది గ్రామములను స్వామికి సమర్పించుకొన్నారేకాని గుడిలో
- ↑ పై చరిత్రవిషయములు పెక్కులు శ్రీసాదుసుబ్రహ్మణ్యశాస్త్రులుగారు రచించిన శాసనముల రిపోర్టులోని విషయములు శాసనములు చదివి సమకూర్చినవి.