పుట:Annamacharya Charitra Peetika.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

91 నూలినేతచే వస్త్రములు గల్పించి లోకమును నాగరక పల్చి యుద్ధరించువా రయిన సాలెవారి కీతఁ డాచార్యపురుషుఁడు. వారి వంశమర్యాదల కీతఁడు సంరక్షకుఁడుగా నుండెను. వీరికి పదివేల వరహాలు పాదకానిక సమర్పించిరి. చిన్నన్న వంశపారం పర్యముగా దమవంశపారంపర్యముగా గురుశిష్యతా సంబంధము వర్ధిల్లఁగోరిరి. ఇందుకు తామ్రాశాసనము వెలయించిరి. కోనేటి తిరువెంగళనాథుఁడు ఈతఁడు సదాశివరాయలచే క్రీ 1544, 1545 అద్దంకిదగ్గజీ బొల్లాపల్లి ఓలపల్లి అని రెండగహారములఁ బడసినాఁడు. క్రీ 1559లో కడపజిల్లా పుష్పగిరి చెన్నరాయనికిఁ గొంతభూమి సమర్పించినాఁడు. ఈతఁడు గొప్పవైభవ మనుభవించినాఁడనుట కీ క్రిందిపద్యముసాక్షి. సీ|| మొకరివా తెర కీర్తిముఖము బంగరుదండె పాలకి యేగురుం డోలి నెక్కె శ్రీజగన్నాథునూర్జితపదాంభోజముల్ సేవించి యేబుధాశ్రితుఁడు వెలసె కాయసిద్ధిని లంబికాయోగమార్గంబు తెలిసి యే ఘనుఁడు సాధించి నెగడె భక్తితోఁ బట్టాభిషిక్తులు ధరసాగి మొక్క నేవిభుఁడు పెంపెక్కి చెలగె నతఁడు పొగడొందు హారనీహారగంధ సారకర్పూరగోక్షీర సదృశయశుఁడు ఘనుఁడు పెదతిమ్మదేశికగర్భజలధి కువలయాపుండు కోనేటిగురువరుండు" | 1. చూ, తామ్రాశాసనము. శ్రీ వెం. ఓ జర్నల్, lవాల్యుం 1 పారు. 2. ఈ పద్యము శ్రీతాళ్ళపాక సూర్యనారాయణయ్యగారి వ్రాఁతకాగితములనుండి కైకొంటిని.