Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82


హరి నీకృపకలిమి నట్లవే యరులచే ।
కరఖడ్గధార నాకుఁ గలువదండాయ ॥నాటి॥ 1

మునుపు హరిశ్చంద్రుమొనకత్తిధార దొల్లి ।
పొనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ ।
వనజాక్ష నీకృపను వరశత్రులెత్తి నట్టి ।
ఘనఖడ్గధార నాకుఁ గస్తూరివాటాయ ॥నాటి॥ 2

చలపట్టి కరిరాజు శరణంటె విచ్చేసి ।
కలుషముఁ బెడఁ బాపి కాచినట్టు ।
అలర శ్రీవెంకటేశ ఆపద లిన్నియు బాపి ।
ఇల నన్నుఁగాచినది యెన్నఁ గతలాయ. ॥నాటి॥ 3


ఈ కీర్తనమునఁ జెప్పఁబడినదేకాక (పుట. 286వుట) సంకీర్తనమున వర్ణితమయిన విషయములుగూఁడఁ బెదతిరుమలాచార్యుని మాహాత్మ్యమును వెల్లడించుచున్నవి. ఆసంకీర్తనమును జినతిరుమలాచార్యుఁడు రచించియుండఁ బోలును.


అచ్యుతరాయలవారు పూండి, సంగమకోటగ్రామములఁ దామ్రశాసన పూర్వకముగా దానము చేయఁగాఁ బెదతిరుమలాచార్యుడు వానిని స్వామికే సమర్పించెను. అతఁ డచ్యుతరాయల జన్మనక్షత్రమునాఁడు తనద్రవ్యముతో స్వామికిఁగైంకర్యములఁగల్పించెను. అచ్యుతరాయలనాఁ డాతఁడు విజయనగరములో విట్ఠలేశ్వరస్వామి కైంకర్యముల కై గొప్పభూ సమర్పణము చేసెను. పెదతిరుమలయ్య స్వామికి అర్పించిన గ్రామములు:- కావనూరు, మరువాకరై, కుప్పము, కీళంగున్రము, మన్నసముద్రము, పూండి, సంగమకోట, (ఈ రెండూళ్ళ సంవత్సరపు రాబడి 1000 రేఖ పాన్నులు) రాయలపాడు, సోమయాజులపల్లి, కత్తమువారిపల్లి, ఎఱ్ఱగుంటపల్లి, పల్లిపురము, (133 వరాహాల సంవత్సరాదాయముకలది.) గండతిమ్మాపురము (100 రేఖ పాన్నులు సంవత్సరాదాయముగలది.) ఈ గ్రామములుగాక-భిన్న భిన్న సమయములలో 4600 పణాలు 5203 పణాలు 2000 వరహాలు 450 పణాలు 1900 పణాలు 1020 నర్పణాలు 2300 సర్పణాలు సమర్పించినారు.