78
ఈ పద్యమునఁ దనతో క్రీ ఉంది 1560 దాఁక వర్తిల్లినవాఁడగు చిన్నన్నను, అతని తండ్రియు క్రీ 1453 దాఁక వర్తిల్లినవాఁడునగు పెదతిరుమలాచార్యుని, అతని యన్నయగు నరసింగన్నను మెచ్చినాఁడు.
ద్విపదమునకుఁ జిన్నన్న వ్రాలును. పదములకుఁ బెదతిరుమలయ్య వ్రాలును. పద్య గద్య (ని) శ్రేణిని నరసింగన్న మిన్నందివైూఁగును! అని దీనియర్థ మను కొందును. నరసింగన్న యిం దధికముగాఁ బ్రస్తుతుఁడయ్యెను. కాని యాతఁడు రచించిన గ్రంథము లేవో తెలియరావు. 'పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు! జోడు లేఁ డన సభఁజొచ్చి వాదించి పరగిన ధీశాలి ప్రతివాది దైత్య నరసింహుఁ డనఁగల్లె నరసింహగురుఁడు', అని చిన్నన్నయష్టమహిషీకళ్యాణమున నాతని స్తుతించెను. ఆతని కుటుంబవృద్ధినిగూడ వివరించెను. చిన్నన్న పేర్కొనుటే కాని దేవస్థానశాననములోఁగాని, తాళ్ళపాక వారి యిండ్డలోఁగాని, లోకమునఁగాని యాతని విషయ మేదియు గానరాకున్నది. చిన్నన్నయే క్రీ 1546 కొండవీటిసీమలోని చెందలూరు మల్లవర గ్రామములను స్వామికైంకర్యములకై సమర్పించుచు నందు మాఘశుద్ధ చతుర్టీతిథిని తన పెదతండ్రిగారయిన నరసయ్యంగారి ప్రత్యాబ్లికదినమున నర్చనావిశేషముల నిర్వహణముకూడఁ జేర్చినాఁడు.[1] ఇది క్రీ 1546 నాఁటికి నరసింగన్న దివ్యధామముఁ బడయుటను జిన్నన్న కాతనిపై గౌరవమును దెలుపుచున్నది.
శ్రీ వీరేశలింగము పంతులుగారు కవిచరిత్రమున కవిర్ణరసాయన కర్త కృష్ణదేవరాయలనాఁటి వాఁడని కృష్ణరాయని "ఆందోళికల యందు నంతరచరులౌట సవికృతాకృతుల పిశాచకజనులు.ప్రభుదురాత్ముల నెవ్వాఁడు ప్రస్తుతించు" నని గర్పించె నని, వ్రాసినారు వృద్ధానుశ్రుతినిబట్టి వ్రాసినయీ వ్రాఁత విశ్వాస్యమే యనుకొందును. కవికర్ణరసాయనకర్త నరసింగన్న తాళ్ళపాకసింగన్న కాఁ గూడు ననుకొందును.
————————————————————————————————— 11
- ↑ తిరుపతి శాసనములు 5 వ్యాల్యుం. 184 పుట, చూ,