77
తివిరి వెంకటాధిప నేను నీ |
కపుఁగిటి కబ్బితి గదనేఁడు|
రవరవ చెమటఁ గరఁగి నేడూ యిదె !
చవులాయెను నీజాజఱ ॥చాలు॥ 3
అన్న, శృంగా. 87 ఱేకు.
నాచనసోమనగూడ వసంతవిలాసమున జాజఱ నిట్లు వర్ణించినాఁడు:
"వీణాగానము వెన్నెలతేట । రాణమీఱఁగా రమణులపాట ।
ప్రాణమైనపినబ్రాహ్మణువీట । జాణలుమెత్తురు జాజఱపాట"॥
ఇంతకుఁ జెప్పవచ్చిన దేమనఁగా విద్యానగరవినాశముపిదప అంధ్రదేశమున సంగీత మన్నఁ గొంత యశ్రద్ద పెరిగినదనుట. అదికారణముగాఁ బ్రాచీనగేయరచన లెన్నో అంతరించి పోయినవి. దాగియున్నను రాగిరేకుల మీఁది కెక్కియుండుటచే నేఁటి కయినను దాళ్ళపాక సంకీర్తనములు పైకి రాఁగల్గినవి.
అన్నమయ నంతానము
నరసింహకవి
అన్నమాచార్యుని ప్రథమభార్యయగు తిరుమలమ్మకు నరసింగన్న, నరసయ్య, నరసింహాచార్యుఁడు అని పేర్కొనఁబడువాఁడు చాలా గొవ్పకవీశ్వరుఁడు కొడు కుండెను. నిరుపమాన సుకవితా నిర్వాహకుఁడయిన తెనాలి రామకృష్ణకవి తనసమీపకాలమువా రగు తాళ్ళపాక కవుల నిట్లు సన్నుతించెను.