73 వెలయించి ప్రతిష్టించి యక్కడ నాళ్వార్లతో భాష్యకార్లతో దేశికులతోసహ అన్నమాచార్యుని విగ్రహమునుగూడఁ బ్రతిష్టించి పూజాపురస్కారములు కల్పించెను. తాళ్ళపాక యరద్వారమున కిరుప్రక్కలనున్న విగ్రహములలో నొకటి ముదివయసుది ఇంకొకటి లేవయసుది గానున్నది. అన్నమాచార్య చరిత్ర (చూ.35 పుట)లో నున్న వర్ణనమున కనుగుణముగానే యిక్కడ రూపకల్పన మున్నది. నంగీతరచన ద్రవిడకర్ణాటాంధ్రభాషలలోకెల్లఁ బ్రాచీనములయిన సంకీర్తనము లన్నమాచార్యునివే. నంకీర్తన శాస్రవును గల్పించినవాఁడు నన్నమాచార్యుఁడే. కనుకనే యూతనికిఁ బదకవితాపితామహుఁ డని, సంకీర్తనాచార్యుఁ డని హరికీర్తనాచార్యుఁ డని బిరుదులుగలిగెను. కన్నడమునఁ బురందరదాసులవారును ప్రాకృతమున వెంకటమఖియు నీయనకుఁ దర్వాతనే సంకీర్తనములు గీతములను రచించిరి. ప్రాఁతవగు కృష్ణాచార్యుని నంకీర్తనములు తాళగంధివచనములేకాని పల్లవి చరణములు గల పదకవితా రచనలుకావు. అట్టి తాళగంధివచనరచనలను పెదతిరుమలాచార్యుఁడుగూడ వైరాగ్యవచనమాలికాగీతము లని పేర్వెట్టి రచించినాఁడు. అవి వెంకటేశ్వరవచనములని వెంకటేశ్వరవిన్నపము లని మద్రాసు తంజావూరి లైబ్రరీలలో నుండగా నేను గుర్తించి ప్రకటించితిని. జాజఱలు, చందమామలు, కోవెల, చిలుక, తుమ్మెదపదములు, లాలి సువ్వి గొబ్బి ఉయ్యాల లాల జోల జోజో జేజే జయజయ విజయీభవ శోభన మంగళ వైభోగములు, మేలుకొలుపులు, నలుఁగులు, దంపుళ్ళ కొట్నాలు, కూగూగులు, గుజ్జెనగూళ్ళు, చందమామ గుటకలు, నివాళులు ఆరతులు, మంగళారతులు, జయమంగళాలు, అల్లోనేరేళ్లు, చాఁగుబళాలు, బళాబళాలు, సాసముఖాలు, అవధానములు, తందానలు, వెన్నెలలు, చిత్తమా, మనసా, బుద్ధి (సంబోధనలు) మొదలగు మధురకవితారచనా విశేషము లీనంకీర్తనములలోఁజాలఁగలవు. అన్నమాచార్యుఁడు సంకీర్తనలక్షణమున వీనిలోఁ గొన్నింటిని బేర్కొనుటచే నంతకుఁబూర్వముననుండియు నివి వాడుకలో వచ్చుచున్నవే
పుట:Annamacharya Charitra Peetika.pdf/75
Appearance