Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71


నిన్ను ధాన్యముచేసీ నిచ్చఁ దాళ్ళపాక !
అన్నమయ్యఁగా రెదుట నదిగో వయ్యా
పన్ని యాతనినే చూచి పాతకులమైన మమ్ము !
మన్నించవయ్య వో మధుసూదనా ॥అఱి॥ 1

సంకీర్తనలు చేసీ సారెఁ దాళ్ళపాక అన్నమయ్య !
అంకెల నీ సన్నిధినే అదిగోనయ్యా !
అంకించి నేవారివాఁడ నని దుష్టుండ నైనా నా !
సంకె దీఱఁ గావవయ్య సర్వేశ్వరా ! ॥అఱి॥ 2

పాదాలం దున్నాఁడు తాళ్ళపాక అన్నమయ్య మీకు !
ఆదరాన ముక్తుండై అదిగో వయ్యా !
ఈ దెస శ్రీవెంకటేశ యీసంబంధాననే నన్ను !
నీదయ వెట్టి రక్షించు నెమ్మది భూరమణా ! ॥అఱి॥ 3

అన్న. అధ్యా. 223ఱేకు


దేసాళం


     ఈతఁడే ముక్తిదోవ యీతండే మా యాచార్యుఁ !
     డీతఁడు గలుగఁబట్టి యిందరు బదికిరి ॥పల్లవి॥

అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు !
యిదె వీఁడె శ్రీవెంకటేశునెదుట !
వెదవెట్టి లోకములో వేదము లన్నియు మంచి !
పదములు సేసి పాడి పావనము సేసెను ॥ఈతడే॥ 1

అలరుచుఁ దాళ్ళపాక అన్నమాచార్యులు !
నిలిచి శ్రీవెంకటనిధియె తానై !
కలిదోషములు వాప ఘనపురాణము లెల్ల !
పలుకుల నించి నించి పాడినాఁడు హరిని ॥ఈతఁడే॥ 2

అంగవించెం దాళ్ళపాక అన్నమాచార్యులు !
బంగారు శ్రీవెంకటేశు పాదములందు !