Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64


తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు !
మొగ మోటలను నేమ మోసపోవ నోపను ॥పర॥ 1

పొసఁగ దేవుఁ డిచ్చినా పూజరి వరమీఁడు !
విసిగి నేవిడిచినా విడువరు లోకులు !
కొనరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు !
పసలేని పనులకు బడల నే నోపను ॥పర॥ 2

నుడుగుట దప్పినా నోముఫల మిచ్చినట్లు !
కడఁగి వేడుకొన్నాఁ గా నిమ్మనరు లోకులు !
తడవేరు తగిలేరు తామె శ్రీవెంకటేశ !
బుడిబుడి సంగాతాలఁ బొరల నే నోపను ॥పర॥ 3

అన్న. అధ్యా 232 ఱేకు.


అన్నమాచార్య పురందరదాసులు


కర్ణాటభాషలో వేలకొలఁది సంకీర్తనముల రచించి మహానుభావుఁడని ప్రఖ్యాతి గాంచిన శ్రీపురందరదాసుఁ డన్నమాచార్యుని దర్శింపవచ్చి యతని సంకీర్తనములు విని తనిసి నీవు శ్రీపాండురంగ విట్ఠలుని యవతారమవే యని సన్నుతించెనట. (చూ. 44, పుట.) పురందరదాసుల వారు శ్రీవ్యాస తీర్థులవారి శిష్యు లని ప్రతీతి. వ్యాసతీర్థులవారు సాళ్వనరసింగరాయనికాలమునఁ గూడఁ గలరు. శ్రీకృష్ణరాయలకు వారు గురువులు. వయసున చిన్నవారయినను వ్యాసతీర్థులను సన్యాసాశ్రమ స్వీకారముచే గురువర్యులనుగాఁ బురందరదాసుల వారు పూజించియుందురు. అన్నమాచార్యుని వార్ధకమునఁ బురందరదాసులవారు చాలఁజిన్నవారై దర్శించియుందురు. పురందరదాసుల వారన్నమార్యుల సంకీర్తనముల ననుకరించి సంకీర్తనముల రచించిరి. మచ్చున కొక్కటి:-


మాళవిరాగం


శరణుశరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతివల్లభా !
శరణు రాక్షసగర్వసంహార శరణు వెంకటనాయకా ॥పల్లవి॥