పుట:Annamacharya Charitra Peetika.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 బలుగానలహరి యింపుల రా ల్గరంగ ! బలసి వినువారిచెవి బడలిక దొలంగ IIevsê)II 6 లలనాజనాపాంగలలితసుమచాప ! జలజలోచనదేవ సదుణకలాప ! తలఁపు లోపలమెలఁగు తత్వప్రదీప ! భళిర గండవరేశ పరమాత్మరూప ווe7 וופ8יט అన్నమయు మహిమలు మండెమురాయనామక నరసింహదండనేత్రు (తృ) న కిష్టధనబల స్ఫూర్తి నిత్యాదివాక్యములకు (చూ 43 పుట.) స్పష్టముగా నర్థమెఱుఁగ రాదు. మండెమురాయఁ డన్నపేరు మండెము గ్రామమున వెలసిన నరసింహస్వామికిఁ గలదు. చండనేత్రుఁ డనియో? దండనేత్రుఁ డనియో? దండనేతృఁడని దిద్ది దండనాథుఁడని యర్థముగుదుర్చుకొనఁగా నాతఁడు సాళువనరసింహరాయని విద్యానగర సామ్రాజ్యలాభమునకుఁ జాలఁ దోడుపడినవాఁడును, నరసింగరాయని తర్వాత నిమ్మడి నరసింహరాయఁ డను తత్పుత్రుడు పేరి కల్పకాలము రాజుగా నున్నను విద్యానగర సామ్రాజ్యము నాక్రమించుకొన్నవాఁడును నగు నరసింహ దండనాథుఁడు కాఁగలఁడు, అన్నమాచార్యు నగ్రహారము మరులుంకు (మరువాకరై?) ఆదండనాథున కిష్టమగు ధనబలస్ఫూర్తి కలది గాఁబోలును. (చూ 43 పుట) ఆగ్రామమునఁగల జీడికంపు పుల్లమామిడి పండ్లను స్వామికి నివేదనచేసి తా నారగింపఁగా నన్నమాచార్యునకుఁ బండు పులిసెను. అపచారము క్షమింప స్వామినివేఁడి దానిని దియ్య మామిడిని జేయ నర్థింపఁగా స్వామియనుగ్రహమున నది తియ్యమామిడి యయ్యెను. ఈ విషయము నీ యన్నమాచార్యచరిత్రమేకాక పెద తిరుమలాచార్యునిఁ గూర్చియున్న సంకీర్తనముకూడ నిరూపించుచున్నది. (రాగము పేరు లేదు) కరము జీడిపులుసు గలిగిన మామిడి కరముసోకిన యంతనే సరవిఁజక్కెరవలెఁ జవిగలిగించువాని చనవరిసుతుఁడితఁడే పల్లవి: