61
రచించియుందు రనుకొంటిని. అదియిది:-
శ్రీరాగం. జంపెతాళం
లాలనుచు నూచేరు లలన లిరుగడల !
బాల గండవరగోపాల నినుఁ జాల ॥పల్లవి॥
ఉదుటుగుబ్బలసరము లుయ్యాల లూఁగ !
పదరి కంకణరవము బహుగతుల మ్రోఁగ !
వొదిఁగి చెంపలకొప్పు లొక్కింత వీఁగ !
ముదురుచెమటల నళికములు తొప్పఁదోఁగ ॥లాలి॥ 1
సొలపు తెలిగన్నుఁగవచూపు లిరువంక !
మలయురవళులకుఁ బలుమాఱును బెళంక !
కొలఁదికోవిలగములు క్రోలుమదనాంక !
ములఁ గ్రేణిసేయు రవములు వడిఁ దలంక ॥లాలి॥ 2
సరసపదములు జంగచాపుచేఁ బాయ !
గురులీల మీఁగాళ్లఁ గుచ్చెళ్ళు రాయ !
కరమూలముల కాంతి కడుఁజాయఁ జేయ !
సరస నురుకుసుమవాసన లెదురు డాయ ॥లాలి॥ 3
కొలఁది నునుమేను లతకూన లసియాడ !
మేలఁకువతొ నొకరొకరి మెచ్చి సరిగూడ !
తల లూఁచి చొక్కి చిత్తరుబొమ్మ లాడ !
అలరి యెల్లరు మోహనాకృతులు చూడ ॥లాలి॥ 4
లలితతాంబూలరసకలితంబు లైన !
తళుకుదంతములు కెంపులగుంపులీన !
మొలకవెన్నెలడాలు ముసురుకొనితోన !
చెలఁగి సెలవుల ముద్దుచిఱునవ్వులాన ॥లాలి॥ 5
మలయమారుతగతులు మాటికిఁ జెలంగ !
పలుకుఁగపురపుతావి పైపై మెలంగ !