60
అంగుగాఁ దాళ్ళ పాకాన్నయ్య చాల !
శృంగారరచనగాఁ జెప్పె నీజోల !
సంగతిగ సకలసంపదల నీవేళ !
మంగళము తిరుపట్ల మదనగోపాల ||జో|| 3
ఈ జోలలో అన్నమాచార్యుని పేరున్నది గాని యది తిరుపట్ల బాలగోపాలదేవునిముద్రతో మాత్రమే యున్నది. నేను ముప్పదేండ్లకుఁ బూర్వము తంజావూరి లైబ్రరినుండి ఈజోల కొన్నిచరణములు వ్రాసియుంచుకొనుట నిటీవలఁ జూచితిని. అది వేఱుతీరుగా నున్నట్టున్నది. అం దీచరణ మున్నది:-
అలిగి తృణావర్తు నవనిఁ గూల్చితివి !
బలిమిమైఁ బూతనఁ బట్టి పీల్చితివి !
చెలఁగి శకటాసురునిఁ జేరి డొల్చితివి !
తలఁచి మదులు రెండు ధరణి వ్రాల్చితివి !!
అన్నమయ శ్రీవెంకటేశ్వరస్వామి మీఁదనే కాక యింక ననేక పుణ్యక్షేత్రములలోని దేవతలమీఁదగూడ సంకీర్తనములు రచించినాఁడు. ఆ సంకీర్తనములలో బెక్కింట నాయాక్షేత్రముల దేవతల పేర్లతో నభేదము గల్పించి తుదిచరణమున శ్రీ తిరుపతి వెంకటేశ్వరస్వామి నామముద్రికను నెట్టుకొల్పుచుండును. ఈ జోలలో స్వామినామముద్ర లేదు. ఇది యిక్కడి రాగిరేకులలో నున్నదో లేదో.
అన్నమయలాలి
తంజావూరిపుస్తకశాలనుండి యిటీవలఁ గొన్ని తాళ్ళపాకసంకీర్తన ములు వ్రాయించి తెప్పించితిమి. అందు మీఁదిజోలవంటి దొకలాలి కలదు. దానఁగూడ గండవరపు బాలగోలపాలుని నామాంక మున్నదిగాని శ్రీ వెంక టేశ్వరస్వామినామాంకము గానరాదు. అన్నమయపేరందు లేకపోయినను గండవరము తాళ్ళపాకవారికిఁ జెల్లుచువచ్చిన గ్రామ మని తెలియుటచే దమయూరిస్వామి మీఁద నన్నమాచార్యుఁడో తత్పుత్ర పౌత్రులో దానిని