పుట:Annamacharya Charitra Peetika.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 ఆచార్యుని మాహాత్మ్యమున కచ్చెరుపడి నరసింగరాయఁడు శరణువేఁడి యాతనిచే ననుగృహీతుఁ డయ్యెను (చూ 39 పుట.) రాయులకైంకర్యములు విజయనగరరాజ్యమున సురక్షితుఁడై నరసింగరాయఁడు 1495 దాఁక రాజ్యమేలెను. సంస్కృతమునఁ దచ్చరిత్రము సాళ్వాభ్యుదయ మని రచితమయ్యెను. రాయఁడే రామాభ్యుదయ మని కావ్యము రచించెను. వీరన యీతనిని శ్రీవెంకటాద్రినాథదయావర్ధితరాజ్యఁ డని రత్నాంశు మత్కాంచీ వెంకట కాళహస్తి నగరీకళ్యాణసౌధాంచల ప్రాంచచ్ఛాశనుఁ డనీ తాను గృతిచేసిన జైమిని భారతమున వర్ణించినాఁడు. శ్రీతిరుపతి వేంకటేశ్వరస్వామి కీతఁ డనేకోత్సవవిశేషములు, నైవేద్య విశేషములు, ఆభరణవిశేషములు, ప్రాకారమండపసోపానాది నిర్మాణ విశేషములు ధనవ్యయముతో వెలయించినాఁడు. వానిని గూర్చి శాసనములు పదునాలు గున్నవి. స్వామి కైంకర్యపరాయణులై కొండమీఁదఁ బ్రఖ్యాతి గాంచియున్న కందాళరామానుజజియ్యంగారి కీఁతడు శిష్యుఁ డయ్యెను. పై కైంకర్యములు స్వామికిఁ గావించుటలో నన్నమా చార్యులయు నా జియ్యంగార్లయు నుపదేశముల నాతఁడు పాటించు చుండవచ్చును. నాఁటియున్నమయు ఆనాళ్ళలో నన్నమాచార్యుఁడు తనయగ్రహారములలోను దాళ్ళపాక లోను గొంతకాలము వసించుచువచ్చినను దిగువ తిరుపతిలోను గొండ మీఁద స్వామిసన్నిధిని నెక్కువకాలము గడపుచువచ్చెను. ఆ చోట్ల గృహాది వసతు లాతనికాలముననే యేర్పడెను. ఆతని కుమారుని నాళ్ళలోఁ గొండ మీదను దిగువతిరుపతిలోను దమగృహములముందు మండపముల గట్టించి యక్కడ స్వామిని వేంచేవ చేయించి, యుత్సవాదులు జరపించుట సాగెను. గుండక్రియు కోటికిం బడగయెత్తి కొంకనేల 1 యీటులేని పదమెక్కి ఇంకనేల చింత iపల్లవి: